విజయ్ దేవరకొండతో రష్మికకు మళ్లీ సెట్ అయిందా..?

కాంబినేషన్స్ ఉండే క్రేజ్ టాలీవుడ్ లో బానే ఉంటుంది. బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ రిపీట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అంచనాలు స్టార్ట్ అవుతాయి. వాటిని అందుకునే కంటెంట్ ఉంటే మరో బ్లాక్ బస్టర్ పడుతుంది. అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ రెడీ అవుతోంది.

లాస్ట్ ఇడియర్ డిజాస్టర్ గా ముగించిన స్టార్ తో పాటు.. బాలీవుడ్ డ్రీమ్స్ లో పడి తెలుగులో లాస్ అయిన బ్యూటీతో పాటు దర్శకుడు కూడా కలిసి కొత్త కలయిక రెడీ అవుతోంది. ఈ కాంబినేషన్ ఏంటో తెలుసా..? గీత గోవిందం టీమ్. యస్.. ఈ డైరెక్టర్ తన హీరో హీరోయిన్ ను రిపీట్ చేస్తూ సినిమా చేయబోతున్నాడు అంటున్నారు. మరి ఈ న్యూస్ లో నిజమెంత..?


విజయ్ దేవరకొండను యూత్ లో క్రేజీ స్టార్ ను చేసింది అర్జున్ రెడ్డి సినిమా. అదే టైమ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసింది గీత గోవిందం. ఈ చిత్రంతోనే ఫస్ట్ టైమ్ అతను రష్మిక మందన్నాతో రొమాన్స్ చేశాడు. మూవీ టైమ్ లో ఈ ఇద్దరి మధ్య నడిచిన ట్విట్టర్ రొమాన్స్ కూడా గీత గోవిందంపై అంచనాలు పెంచింది.

అదే టైమ్ లో వీరి రిలేషన్ పై అనుమానాలూ క్రియేట్ చేసింది. అన్నిటితో పాటు మంచి కంటెంట్ కూడా పడటంతో గీత గోవిందం కలెక్షన్స్ లో ఏకంగా వంద కోట్ల మార్క్ ను టచ్ చేసింది. పరశురామ్ ను కూడా దర్శకుడుగా స్టార్ రేస్ లోకి తెచ్చిందీ మూవీ.

ఈ మూవీ కలెక్షన్స్ తోనే అతను తర్వాత మహేష్‌ బాబుతో సర్కారువారి పాట చిత్రానికి అవకాశం అందుకున్నాడు. ఆ మూవీ అంచనాలను అందుకోలేకపోయినా.. 2022లో హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో సెకండ్ ప్లేస్ లో నిలవడం విశేషం. బట్ సూపర్ స్టార్ ను మాత్రం కొత్తగా చూపించాడు. కీర్తి సురేష్ లోని గ్లామర్ యాంగిల్ ఆడియన్స్ కు తెలిసేలా చేశాడు పరశురామ్.

ఇక ఇటు గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తో వచ్చిన తర్వాతి సినిమా డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. వీరి జంట ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్స్ లోనే ఉంటోంది. అలాంటి కపుల్ తో మరో సినిమా చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు పరశురామ్. నిజానికి అతను నాగ చైతన్యతో మూవీ చేయాలి. కానీ అతను సర్కారువారిపాట టైమ్ లో జరిగిన ఇష్యూను మర్చిపోలేదంటున్నారు.


ఇక విజయ్ దేవరకొండ ఇప్పుడు గౌతమ్ తిన్ననూరితో ఓ ప్రాజెక్ట్ కు కమిట్ అయి ఉన్నాడు. అటు రష్మిక తెలుగులో పుష్ప తప్ప మరో సినిమా కమిట్ కాలేదు. సో ఈ కపుల్ ను మళ్లీ రిపీట్ చేస్తే.. గీత గోవిందం క్రేజ్ తో పాటు వీరి జంట కూడా ప్లస్ అవుతుందనుకుంటున్నారు. ఈ కాంబోలో సినిమాను నిర్మించేందుకు దిల్ రాజు రెడీగా ఉన్నాడు. అతనికి విజయ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అది ఇదే అవుతుందంటున్నారు. సో.. మరి ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలోనే వస్తుందట.

Related Posts