థర్డ్ వీక్ లో అన్న.. లాస్ట్ వీక్ లో తమ్ముడు

టాలీవుడ్ లో ఇప్పుడు అన్నదమ్ములైన హీరోల జోరు బాగా నడుస్తోంది. ఎవరికి వారు కొత్త కొత్త కథలు ఎంచుకుంటూ.. అవసరమైతే ఒకరి హీరోయిన్ తో మరొకరు రొమాన్స్ లు కూడా చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ఈ అన్నదమ్ముల లిస్ట్ లోకి లాస్ట్ ఇయర్ వచ్చిన కుర్రాడు వైష్ణవ్ తేజ్. అంతకు ముందే మెగా మేనల్లుడుగా సాయిధమర్ తేజ్ తనదైన ముద్ర వేసుకుని టాలీవుడ్ లో పాగా వేశాడు.

అతని తమ్ముడుగా, మరో మెగా మేనల్లుడుగా ఉప్పెన సినిమాతో వచ్చి ఫస్ట్ మూవీకే బెస్ట్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్. తర్వాత వచ్చిన కొండపొలం, రంగరంగ వైభవంగా చిత్రాలు ఆకట్టుకోలేకపోయినా.. కుర్రాడు కూడా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తాడు అని మొదటి చిత్రానికే అనిపించుకున్నాడు. వైష్ణవ్ ప్రస్తుతం ఓ కొత్త దర్శకుడుతో చేసిన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది.

ఇక గతేడాది బైక్ యాక్సిడెంట్ కు గైర కొద్దిలో ప్రాణాలు దక్కించుకున్నాడు సాయిధరమ్ తేజ్. అంతకు ముందు అతను వరుస విజయాలతో ఉన్నాడు. ప్రమాదానికి గురయ్యే టైమ్ లో రిపబ్లిక్ మూవీ రిలీజ్ కు ఉంది. అతను హాస్పిట్ లో ఉండగానే రిపబ్లిక్ విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం అతను విరూపాక్ష అనే సినిమాతో రాబోతున్నాడు. విశేషం ఏంటంటే.. ఈ అన్నదమ్ములిద్దరి సినిమాలూ ఒకే నెలలో వారం గ్యాప్ లో రాబోతున్నాయి.


సాయితేజ్ నటించిన విరూపాక్ష ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సంయుక్త మీనన్ హీరయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకుడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన కాన్సెప్ట్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ప్రమాదం తర్వాత వస్తోన్న సినిమా కావడంతో సాయితేజ్ మూవీపై చాలామంది ఆసక్తిగా ఉన్నారు.


ఇక అన్నయ్య వచ్చిన వారం తర్వాత తమ్ముడు వైష్ణవ్ తేజ్ రాబోతున్నాడు. వైష్ణవ్ నటించిన నాలుగో సినిమా ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాగా కనిపిస్తోంది. మరి వారం గ్యాప్ లో వస్తోన్న అన్నదమ్ముల్లో బాక్సాఫీస్ ను గెలుచుకునేది ఎవరో చూడాలి.

Related Posts