‘విశ్వంభర‘.. ఒకే ఫ్రేములో చిరంజీవి, త్రిష, కీరవాణి

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటింగ్ మూవీ ‘విశ్వంభర‘. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకోసం కీరవాణి ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. గతంలో చిరంజీవికి ‘ఘరానామొగుడు, ఆపద్భాంధవుడు‘ వంటి మెమరబుల్ మ్యూజికల్స్ అందించాడు కీరవాణి. మళ్లీ ముఫ్ఫై ఏళ్ల తర్వాత చిరు-కీరవాణి కాంబోలో రూపొందుతోన్న సినిమా ‘విశ్వంభర‘.

అలాగే.. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుంది. ‘స్టాలిన్‘ తర్వాత చిరంజీవితో మరోసారి త్రిష నటిస్తున్న సినిమా ఇది. అలా.. ఒకవైపు కీరవాణి, మరోవైపు త్రిష లతో చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమాగా ‘విశ్వంభర‘ నిలవబోతుంది. అందుకు తగ్గట్టే.. లేటెస్ట్ గా ఈ ముగ్గురూ కలిసి ఒకే ఫ్రేములో ఉన్న ఫోటోస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Related Posts