‘ఓం భీమ్ బుష్‘ ఇండస్ట్రీ టాక్ అదిరిపోయింది

ఈవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలలో శ్రీవిష్ణు నటించిన ‘ఓం భీమ్ బుష్‘ ఒకటి. ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా ‘హుషారు‘ ఫేమ్ హర్ష కొనుగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణుతో పాటు మరో ఇద్దరు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ఉన్నారు. గతంలో వీరు ముగ్గురు ‘బ్రోచేవారెవరురా‘ సినిమాతో పంచిన కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక.. ఈ సినిమాలోనూ అంతకుమించి అన్నట్టుగా హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ అందించబోతున్నారట.

ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ప్రకారం ‘ఓం భీమ్ బుష్‘ మూవీలో ఫస్టాఫ్ లో ఓ రెండు బ్లాక్స్, సెకండాఫ్ లో ఓ మూడు బ్లాక్స్ ఆడియన్స్ కు హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ పంచబోతున్నాయట. కేవలం కామెడీ అనే కాకుండా ఈ మూవీలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ కి కూడా కొదవే లేదనే టాక్ వినిపిస్తుంది. ఓ సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందిన ‘ఓం భీమ్ బుష్‘ మంచి విజయాన్ని సాధించడం పక్కా అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. రేపే భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా ‘ఓం భీమ్ బుష్‘ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts