రామ్ చరణ్ సినిమా ఆగిపోలే .. ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. ఆర్ఆర్ఆర్ తర్వాత జెట్ స్పీడ్ తో దూసుకుపోదాం అనుకున్నాడు. ఆ స్పీడ్ కు ఆచార్య బ్రేక్ వేసింది. బట్.. శంకర్ తో చేస్తోన్న సినిమాతో మరోసారి ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయొచ్చు అనుకున్నాడు. అనుకున్నట్టుగానే దిల్ రాజు నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ గ్రాండ్ గా స్టార్ట్ అయ్యి అంతే గ్రాండ్ గా షూటింగ్ కూడా జరుగుతోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీపై రీసెంట్ గా చాలా రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది అనేది ఆ రూమర్స్ సారాంశం. అందుకు కారణం.. శంకర్ భారతీయుడు2 కోసం వెళుతున్నాడు అని. నిజానికి చరణ్‌ మూవీ కంటే ముందే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అనుకోని కారణాలతో ఆగిపోయింది. ప్రస్తుతం ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. దీంతో నిర్మాతలు శంకర్ పై ఒత్తిడి తెచ్చారు. ముందు తమ సినిమాను పూర్తి చేయమని కోర్ట్ వరకూ వెళ్లారు. చివరికి చేసేదేం లేక.. శంకర్ ఈ రెండు సినిమాలనూ సైమల్టేనియస్ గా షూట్ చేయాలనుకున్నాడు. అయితే ఆ నిర్ణయాన్ని కూడా తమిళ్ నిర్మాతలు ఒప్పుకోలేదని చెప్పారు. మొత్తంగా ఈ వ్యవహారంలో ఇటు రామ్ చరణ్‌ ఫ్యాన్స్ కు ఎలా స్పందించాలో తెలియలేదు. అసలు సినిమా ఉందా లేదా అనేది కూడా అర్థం కాలేదు. ఫైనల్ గా అసలు వ్యక్తే స్పందించాడు.
ఆ అసలు వ్యక్తి శంకర్. మొదట అనుకున్నట్టుగానే శంకర్.. భారతీయుడు2తో పాటు చరణ్‌ సినిమాను కూడా సైమల్టేనియస్ గా షూటింగ్ చేయబోతున్నట్టు ట్విట్టర్ లో వెల్లడించాడు. చెప్పడమే కాదు.. ప్రస్తుతం భారతీయుడు2 చిత్రీకరణలో ఉన్న తను సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో చరణ్ సినిమా షూటింగ్ ను హైదరాబాద్ తో పాటు విశాఖపట్నంలలో కూడా చేయబోతున్నట్టు చెప్పి చరణ్‌ ఫ్యాన్స్ డౌట్స్ ను క్లియర్ చేశాడు. సో.. ఓ షెడ్యూల్ ఇక్కడ ఓ షెడ్యూల్ అక్కడ అన్నమాట.
అయినా ఈ రెండు సినిమాలకూ బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. ప్రీ ప్రొడక్షన్ కూడా అయి ఉంది కాబట్టి.. ప్రాబ్లమేం ఉండదు. కాకపోతే రిలీజ్ డేట్స్ లో మార్పులు వస్తాయి అంతే.

Related Posts