క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కి బర్త్ డే విషెస్

ప్రతి దర్శకుడికీ ఓ శైలి ఉంటుంది. అది అందరికీ నచ్చాలనేం లేదు. బట్.. కొందరు దర్శకులుంటారు.. వాళ్లు ఏం చేసినా ఆడియన్స్ కు నచ్చుతుంది. కారణం.. కొత్తదనం. కొత్తగా ఆలోచించడమే కాదు.. కొత్తగా ప్రజెంట్ చేయడం ఆ దర్శకులకు ఎంతోమంది అభిమానులను తెస్తుంది. అలాంటి దర్శకుల్లో తెలుగు నుంచి ఖచ్చితంగా మొదటి వరసలోనే ఉంటాడు సుకుమార్. మేటి దర్శకులతో కూడా క్రియేటివ్ జీనియస్ అనిపించుకున్న ఈ లెక్కల మాస్టారి బర్త్ డే ఇవాళ (జనవరి 11).

సినిమాపై విపరీతమైన ప్యాషన్ ఉన్న అరుదైన దర్శకుల్లో సుకుమార్ ఒకడు. ఆ విషయాన్ని తొలి సినిమా ‘ఆర్య‘ తోనే నిరూపించుకున్నాడు. ఒన్ సైడ్ లవ్ అనగానే గంభీరమైన హీరోను చూసిన మనకు ఒన్ సైడ్ లవ్ లోని మజాను కూడా చూపించాడు. ఆ తర్వాత సుక్కూ సినిమాలన్నీ అదే స్టైల్ లో కొత్తదనంతోనే సాగుతూ వస్తున్నాయి. ఇక.. ‘పుష్ప‘ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా అవతరించాడు సుకుమార్. రాజమౌళి తర్వాత తెలుగు నుంచి ఆ ఘనత సాధించిన దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప 2‘ కోసం యావత్ భారతీయ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దాదాపు రెండు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమలో కొనసాగుతోన్న సుక్కూ.. ఇప్పటివరకూ కేవలం ఎనిమిది సినిమాలను మాత్రమే విడుదల చేశాడంటే.. ఒక్కో సినిమా పట్ల అతని డెడికేషన్ ను అర్థం చేసుకోవచ్చు. తాను ఎదగడమే కాకుండా తన శిష్యులను కూడా దర్శకులుగా తీర్చిదిద్దుతున్నాడు. సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించి వాళ్లకు దర్శకులకు అవకాశాలు అందిస్తున్నాడు.

Related Posts