‘హనుమాన్‘ రివ్యూ.. బాలీవుడ్ నుంచి ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది

పేరుకు చిన్న సినిమాగా మొదలైనా.. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో విడుదలవుతోంది ‘హనుమాన్‘. అసలు సిసలు ఇండియన్ సూపర్ హీరో మూవీగా సంక్రాంతి బరిలో సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ నటించిన ఈ సినిమాకి బాలీవుడ్ నుంచి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్స్ ‘హనుమాన్‘ సినిమాకి ఫ్యాసినేటింగ్ అంటూ ఒన్ వర్డ్ రివ్యూ అందించాడు. ఈ చిత్రానికి మూడున్నర స్టార్ల రేటింగ్ ఇచ్చాడు తరణ్.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టేలా ‘హనుమాన్‘ ఉందని. డ్రామా, ఎమోషన్స్, వి.ఎఫ్.ఎక్స్, మైథాలజీ అన్నీ కలగలిసి ‘హనుమాన్‘ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించాడు తరణ్ ఆదర్శ్. ఇక.. ఈ సినిమాలో హీరో తేజ సజ్జ తన క్యారెక్టర్ ను చాలా ఈజ్ తో పోషించాడని.. ఇంకా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్ పోషించిన పాత్రలు గుర్తిండిపోయేలా ఉన్నాయని తన రివ్యూలో తెలిపాడు తరణ్ ఆదర్శ్.

ఈ సినిమాలో ప్రత్యేకంగా వి.ఎఫ్.ఎక్స్ కీలక పాత్ర పోషించాయని.. హిందీ డబ్బింగ్ బాగుందని.. అయితే.. ‘హనుమాన్‘ ఫస్టాఫ్ కాస్త డ్రాగ్ చేసినట్టు అనిపించిందని తెలిపాడు. ఓవరాల్ గా ‘హనుమాన్‘ సినిమాకి బాలీవుడ్ నుంచి మంచి పాజిటివ్ రివ్యూస్ అయితే వస్తున్నాయి.

Related Posts