బ్రహ్మానందం ఆటోబయోగ్రఫీ అందుకున్న రామ్ చరణ్

బ్ర‌హ్మానందం జీవితంలోని అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో, అనుభ‌వాల‌తో ప్ర‌చురిత‌మైంది ‘నేను’ పుస్తకం. బ్ర‌హ్మానందం ఆటోబ‌యోగ్ర‌ఫీగా విడుద‌లైన ‘నేను’ పుస్త‌కానికి బ్ర‌హ్మానందం అభిమానుల్లోనూ, సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా, పుస్త‌క ప్రియుల్లోనూ మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. నేను ఆటోబ‌యోగ్ర‌ఫీ గురించి ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి కూడా అభినందించారు. బ్రహ్మానందం కృషిని ప్ర‌శంసించారు. తాజాగా గ్లోబ‌ల్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్‌కి త‌న ఆటోబ‌యోగ్ర‌ఫీ ‘నేను’ను బ‌హూక‌రించారు బ్ర‌హ్మానందం.

‘నేను’ పుస్త‌కాన్ని అందుకున్న రామ్‌ చ‌ర‌ణ్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. బ్ర‌హ్మానందంగారు త‌మ జీవితంలోని అనుభ‌వాల‌తో నేను’ రాశారు. అత్య‌ద్భుత‌మైన ఆయ‌న జీవిత ప్ర‌యాణాన్ని ఇందులో సంక్షిప్తం చేశారు. అక్క‌డ‌క్క‌డా చ‌మ‌త్కారంతో, మ‌న‌సులోని ఎన్నెన్నో విష‌యాల‌ను ఇందులో రాసుకున్నారు. ఓ వైపు జీవిత పాఠాల‌ను నేర్పుతూ, అనుభ‌వాల‌ను పంచుకుంటూ, అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తూ, ఎన్నో సినిమాల సంగ‌తుల‌ను గుర్తుచేస్తూ, ఆద్యంతం అద్భుతంగా సాగింది ఈ పుస్త‌కం. బ్ర‌హ్మానందంగారు రాసిన ఆటోబ‌యోగ్ర‌ఫీ ‘నేను’ అంద‌రికీ అందుబాటులో ఉంది. ప్ర‌తి ఒక్క‌రూ చ‌ద‌వ‌ద‌గ్గ పుస్త‌కం ఇది అని ట్వీట్ చేశాడు గ్లోబ‌ల్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్‌.

Related Posts