బాలయ్య అక్కడ స్ట్రాంగ్.. అన్ని చోట్లా వీక్ ..

ఇద్దరు పెద్ద హీరోలు బాక్సాఫీస్ వార్ లో తలపడితే అప్పర్ హ్యండ్ ఎవరిది అని అంతా ఆసక్తిగానే చూస్తారు. ఈ సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ వచ్చారు. బాలయ్య.. చిరంజీవి కంటే ఒకరోజు ముందు వచ్చాడు. అప్పటికే సంక్రాంతి ఫీవర్ స్టార్ట్ అయింది కాబట్టి.. స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసి ఏకంగా మొదటి రోజే 54 కోట్ల గ్రాస్ వసూలు చేశాడు. ఈ ఊపు తర్వాత కూడా కంటిన్యూ అవుతుందనుకున్నారు చాలామంది. బట్ టాక్ డివైడ్ గా ఉండటంతో పాటు నెక్ట్స్ డే చిరంజీవి వాల్తేర్ వీరయ్య రావడంతో కాస్త డల్ అయింది.

అయినా సీడెడ్ లో వీర సింహారెడ్డికి ఎదురే లేకుండా పోయింది. ఓ దశలో బాహుబలి రికార్డ్స్ ను కూడా బద్ధలు కొట్టాడు బాలయ్య. ఇటు చిరంజీవి సినిమాకూ డివైడ్ టాక్ వచ్చినా.. ఎందుకో ఎంటర్టైన్మెంట్ పరంగా కాస్త ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీనికి తోడు రవితేజ కూడా ఉండటంతో మరింత కలిసొచ్చింది. అలా మెల్లగా మూడో రోజుకు చిరంజీవి, బాలయ్యపై పై చేయి సాధించడం మొదలుపెట్టాడు. ఆదివారం తర్వాత మొదటగా చిరంజీవి సినిమాకు వంద కోట్ల పోస్టర్ పడింది. మూడు రోజుల్లో మెగాస్టార్ మూవీ 108 కోట్లు కలెక్ట్ చేస్తే.. నాలుగు రోజులకు బాలయ్య మూవీ 104 కోట్లు కలెక్ట్ చేసింది. అలా చిరంజీవికాస్త పై చేయి సాధించినట్టైంది. అయితే ఈ ఫిగర్స్ బాలయ్య కెరీర్ లోనే హయ్యొస్ట్ కావడం విశేషం.


ఇక మొదటి రోజు బాలకృష్ణ నైజాంలో అదరగొట్టాడు. మామూలుగా నైజాంలో బాలయ్య ఇంత బలం లేదు. ఇది మెగా అడ్డా అనే టాక్ మొదటి నుంచి ఉంది. మెగాస్టార్ కు అతి దగ్గరగా కలెక్ట్ చేశాడు. చిత్రంగా నైజాంలో నెక్ట్స్ డే కే కలెక్షన్స్ తగ్గాయి. ఇక గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ఏరియాస్ లో వాల్తేర్ వీరయ్య స్ట్రాంగ్ గా ఉంటే వీర సింహారెడ్డి వీక్ అయింది. బట్.. కృష్ణా, గుంటూర్ తో పాటు సీడెడ్ లో మాత్రం బాలయ్యను చిరంజీవి దాటలేకపోతున్నాడు. మరోవైపు బాలయ్య సినిమాకు వారసుడు, కళ్యాణం కమనీయం సినిమాలు కూడా మైనస్ అయ్యాయి. ఇవ్వడమే మామూలు థియేటర్స్ ఇచ్చారు.

ఈ రెండు సినిమాలు వచ్చాక ఎక్కువగా వీర సింహారెడ్డి థియేటర్స్ నే ఇచ్చారు అనేది అభిమానుల వెర్షన్. ఇక ఈ సోమవారం నుంచి ఎవరు స్ట్రాంగ్ గా ఉంటే వారిదే ఈ సంక్రాంతికి పై చేయి అనుకోవచ్చు. ఇప్పటికి ట్రెండ్ ను బట్టి చూస్తే ట్రేడ్ అంచనా మెగాస్టార్ దే సంక్రాంతి అంటోంది. మొత్తంగా ఈ విషయంలో చిరంజీవిపై అప్పర్ హ్యాండ్ అవుతాం అనుకున్న బాలయ్య ఫ్యాన్స్ కాస్త గుస్సాగానే ఉన్నారు.

Related Posts