శ్రీ లీల సెకండ్ హీరోయిన్ కాదంట..

టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ క్రేజీయొస్ట్ బ్యూటీ అంటే శ్రీ లీల పేరే చెబుతున్నారు అందరు. వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ లో పార్ట్ అయిందీ బ్యూటీ. పైగా ఈ రెండు సినిమాల్లో తనే ఓ హైలెట్ గా నిలిచింది. యాక్టింగ్ తెలుసు, డ్యాన్సులు ఇరగదీస్తోంది. హైపర్ యాక్టివ్ గా ఉంది. దీనికి తోడు ఎక్స్ పోజింగ్ విషయంలో మరీ గిరిగీసుకుని లేదు. దీంతో తనిప్పుడు టాలీవుడ్ లో హాట్ కేక్ గా మారింది. వరుస సినిమాలతో బిజిబిజీగా మారిపోయింది. రెండు సినిమాలకే కోటికి పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే స్థాయికి చేరింది.

తన డిమాండ్స్ కు నిర్మాతలు కూడా ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం రామ్-బోయపాటి మూవీ, జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి సరసన, నితిన్ తో ఓ మూవీ, పంజా వైష్ణవ్ తేజ్ మూవీస్ తో పాటు ఓ కన్నడ సినిమా కూడా చేస్తోంది. దీంతో పాటు రీసెంట్ గా తను మహేష్‌ బాబు, త్రివిక్రమ్ సినిమాలో రెండో హీరోయిన్ గా తీసుకున్నారు అనే టాక్స్ వచ్చాయి. అయితే రెండో హీరోయిన్ అంటే తను చేయను అని చెప్పిందట. పైగా ధమాకా హిట్ తర్వాత కూడా సెకండ్ హీరోయిన్ గా చేస్తే కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందనే కారణంతో తను ఆ ప్రాజెక్ట్ నుంచే తప్పుకుంది అన్నారు. బట్ తను ఆ మూవీ నుంచి తప్పుకోలేదు. అలాగని సెకండ్ హీరోయిన్ కూడా కాదట. మరి ఇదేం లాజిక్ అనిపిస్తోంది కదూ..?


మహేష్, త్రివిక్రమ్ మూవీలో మెయిన్ హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తోంది. మామూలుగా త్రివిక్రమ్ అన్ని సినిమాల్లోనూ సెకండ్ హీరోయిన్ కు ఛాన్స్ ఉంటుంది కదా..? ఆ ఛాన్స్ ను యంగ్ బ్యూటీగా హల్చల్ చేస్తోన్న శ్రీ లీలకు ఇచ్చారు. కానీ తనను సెకండ్ హీరోయిన్ గా ప్రొజెక్ట్ చేయొద్దనీ.. తనూ ఓ హీరోయిన్ గానే నటిస్తున్నట్టుగా చెప్పాలనే కండీషన్ పెట్టిందట ఈ కుర్రపిల్ల. దాన్లో ఏముందీ.. ఓకే అనేశాడు నిర్మాత నాగవంశీ. అందుకే తనను సెకండ్ హీరోయిన్ అనే ట్యాగ్ తో కాక మరో హీరోయిన్ అనే మాటతో పిలవబోతున్నారు. సో.. తను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోలేదు.. అలాగే సెకండ్ హీరోయిన్ కూడా కాదు. అదీ లాజిక్. ఏదైనా ఇలాంటి మ్యాజిక్ లు చేయడంలో త్రివిక్రమ్ తర్వాతే ఎవరైనా.. సో.. ఇక అమ్మడు సూపర్ స్టార్ తోనూ రొమాన్స్ చేయబోతోందన్నమాట.

Related Posts