HomeLatestUnni mukundan : అనుష్క హీరోపై అత్యాచారం కేస్

Unni mukundan : అనుష్క హీరోపై అత్యాచారం కేస్

-

మాలీవుడ్ హీరోలు అంటే మన దగ్గర మంచి క్రేజ్ ఉంటుంది. ఒకప్పటి మోహన్ లాల్, మమ్మూట్టి నుంచి నేటి దుల్కర్ సాల్మన్ వరకూ మనవాళ్లు ఆదిరించినవాళ్లే. అయితే అక్కడ కొంతమంది తేడా హీరోలు కూడా ఉన్నారు.

ఆల్రెడీ హీరోగా కెరీర్ టాప్ రేంజ్ లో ఉన్నప్పుడే దిలీప్ కుమార్ నటి భావనపై అత్యాచారయత్నం చేయించాడు అనే ఆరోపణలతో కొన్నాళ్ల పాటు జైలుకు వెళ్లాడు.ఈ కేస్ ఇంకా తేలకముందే అతను ఆ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేస్తోన్న పోలీస్ అధికారిపై హత్యాయత్నం చేశాడు అనే మరో కేస్ ను కూడా ఫేస్ చేస్తున్నాడు. ఇక దిలీప్ కుమార్ తర్వాత ఇప్పుడు ఉన్నిముకుందన్ ఏకంగా అత్యాచార ఆరోపణలతో జైలుకు వెళ్లబోతున్నాడు అనేది మాలీవుడ్ న్యూస్.


ఉన్ని ముకుందన్ అంటే అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన భాగమతి చిత్రంలో ఆమెకు జోడీగా నటించాడు. అలాగే ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కొడుకుగా నెగెటివ్ రోల్ లో నటించాడు. ఇక రీసెంట్ గా వచ్చిన సమంత యశోదలోనూ నెగెటివ్ పాత్ర చేశాడు.


ఉన్ని ముకుందన్ పై 2017లో అత్యాచారయత్నం కేస్ నమోదు అయ్యింది. ఆ కేస్ లో అతన్ని లోకల్ కోర్ట్ దోషిగా నిర్ధారించింది. ఇదే కేస్ కు సంబంధించి సదరు యువతి అతనిపై పరువు నష్టం దావా వేసిందని తనను డబ్బులు డిమాండ్ చేస్తుందని కూడా చెప్పాడు ఉన్ని ముకుందన్. కానీ కోర్ట్ అవేవీ పట్టించుకోకుండా దానిపై స్టే విధించింది. ఈ స్టే కొనసాగుతుండగానే అతను హై కోర్ట్ కు వెళ్లాడు. లేటెస్ట్ గా హై కోర్ట్ కూడా కింది కోర్ట్ తీర్పును సమర్థిస్తూ అతన్ని దోషిగానే ప్రకటించింది. ఈ కేస్ కోసం అతను సుప్రీంకోర్ట్ వరకూ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు.కానీ ఆలోగా హైకోర్ట్ ఉత్తర్వులు వస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. సుప్రీమ్ కోర్ట్ లోపోరాటం జైలు నుంచే చేయాల్సి ఉంటుంది.

అన్నట్టు మనోడు ఈ మధ్యే మాలికాపురం అనే సినిమాలో అయ్యప్ప భక్తునిగా నటించి మంచి హిట్ కొట్టాడు.

ఇవీ చదవండి

English News