Mahesh babu : సూపర్ స్టార్ బర్త్ డే ట్రీట్ ఏంటీ మహేష్‌..?

సూపర్ స్టార్ గా తెలుగులో తిరుగులేని క్రేజ్ తో ఉన్న మహేష్‌ బాబుకు చాలాకాలంగా ఓసెంటిమెంట్ ఉంది. ప్రతి యేడాది మే 31తండ్రి సూపర్ స్టార్ కృష్ణగారి బర్త్ డే రోజున తన చిత్రాలకు సంబంధించిన అప్డేట్‌ ఏదో ఒకటి ఇస్తుంటాడు. ఇక ఆయన లేకుండా ఫస్ట్ టైమ్ బర్త్ డే వచ్చింది. మరి ఈ బర్త్ డే కు కూడా ఆ సెంటిమెంట ను కంటిన్యూ చేస్తాడా అనే టాక్స్ టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

పైగా ఈ నెల 31న కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా ఆయన ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటైన మోసగాళ్లకు మోసగాడును రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు మహేష్‌ బాబు కొత్త సినిమా అప్డేట్ కోసం కూడా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.


ప్రస్తుతం మహేష్‌ బాబు ..త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరుత్సాహపరిచాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది. పైగా ఇద్దరూ వరుస బ్లాక్ బస్టర్స్ తో ఉన్నారు.

దీంతో ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమా షూటింగ్ సాగడం లేద