సీనియర్ నటుడు శరత్ బాబు రీసెంట్ గా అనారోగ్యంతో కన్నుమూశారు. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనటించి తనదైన ముద్రను బలంగా వేశారు శరత్ బాబు. మంచి రూపం, అంతకు మించిన డిక్షన్ తో సాత్వికమైన పాత్రల్లో అచ్చంగా జీవించారు శరత్ బాబు. ఆయన నటనలో ఎక్కడా అతి కనిపించదు. ఏ పాత్రైనా పూర్తిగా స్టడీ చేసి నటిస్తున్నాడా అనిపిస్తుంది.
అందుకే ఆయన నటన అత్యంత సహజంగా కనిపిస్తుంది. తెలుగువాడే అయినా శరత్ బాబుకు తమిళ్ హీరోల్లో ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. ముఖ్యంగా కమల్ హాసన్, రజినీకాంత్ లతో విడదీయరాని బంధం ఉంది. అలాంటి శరత్ మరణం యావత్ దక్షిణ భారత చిత్రసీమలో విషాదం నింపింది.
ఇదే సందర్భంగా నటి రమాప్రభను పెళ్లి చేసుకుని మూడేళ్లకే విడిపోయిన ఆయన మళ్లీపెళ్లి చేసుకోలేదు. వీరికి వారసులు కూడా లేరు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ సినిమాల్లోనటిస్తూ వచ్చారు.
ఇప్పటి వరకూ కెరీర్ లో 300కు పైగా చిత్రాల్లో నటించారు శరత్ బాబు. చాలా క్రమశిక్షణగా జీవించే శరత్ బాబు ఆస్తులు కూడా బాగానే కూడబెట్టారు. వారసులు లేని శరత్ బాబు ఆస్తి ఎవరికి చెందుతుంది.. అనే ప్రశ్న ఆయన మరణించిన దగ్గరనుంచీ వినిపిస్తోంది. అయితే శరత్ బాబుకు సొంత వారసులు లేకపోయినా.. తన కుటుంబ సభ్యులను చేరదీశాడు. అక్క, చెల్లెలు, సోదరుల పిల్లలను చేరదీశారు. అందరి మంచి చెడ్డా ఆయనే చూశారు. ఇక తన మరణానికి ముందే దాదాపు 17మంది కుటుంబ సభ్యులకు సమానంగా ఆస్తుల పంచేశారు అని టాక్. అయినా ఇంకా కొంత ఆస్తులు మిగిలి ఉన్నాయని.. వాటి కోసమే ఆ బంధువులంతా ఆయన గురించి హాస్పిటల్ లో ఒకరిని మించి ఒకరు కేర్ తీసుకునే ప్రయత్నం చేశారంటారు.
ఎంత బిల్ అయినా చెల్లించేందుకు సిద్ధపడ్డారనీ.. ఆయన కోలుకుని వస్తే.. ఆ మిగిలిన ఆస్తిని తమ పేర రాయించుకోవచ్చు అనుకున్నారనీ.. అయితే ఇందులో ఏ తప్పూ లేదని కూడా చెబుతారు. ఎలాగూ ఆయన పోయిన తర్వాత ఎవరో ఒకరికి ఆ ఆస్తి చెందాలి. అది ఎవరికి చెందాలి అన్నదాని కోసమే కుటుంబ సభ్యులు ప్రయత్నించారు తప్ప.. కేవలం ఆస్తి కోసమే ఆరాటం లేదంటారు. ఏదేమైనా.. సొంతంగా వారసులు లేకపోయినా.. తన బంధువులుకు తన ప్రధానమైన ఆస్తి మొత్తం రాసి ఇచ్చారు శరత్ బాబు.