“పుష్ప”తో అల్లు అర్జున్ మరో ఎవర్ గ్రీన్ రికార్డ్

అంచనాలను నిలబెట్టుకుంటూ స్లో అండ్ స్టడీ సక్సెస్ ను అందుకుంది అల్లు అర్జున్ పుష్ప. సుకుమార్, అల్లు అర్జున్ హ్యాట్రిక్ చిత్రంగా విపరీతమైన అంచనాల మధ్య రిలీజైంది పుష్ప. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో అనూహ్య విజయాన్ని సాధించింది. ఇటీవల కేంద్ర సమాచార శాఖ పుష్ప సినిమా పోస్టర్ తో మాస్క్ తీసేదెలే అని ప్రచారం చేస్తుందంటే పుష్ప క్రేజ్ దేశీయంగా ఎంతగా ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. పుష్ప విజయంలో సంగీతానికి కీలక పాత్ర. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం పుష్పను మరోస్థాయికి చేర్చాయి. సుకుమార్, అల్లు అర్జున్, డీఎస్పీ కాంబో మ్యాజిక్ మరోసారి చూపించాయి.

అల వైకుంఠపురములో సినిమా నుంచి రికార్డులను అలవాటుగా చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అల..ఆడియో రికార్డ్ స్థాయి హిట్ అయి వన్ బిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ కూడా అప్పటికి ఒక రికార్డే. ఈ సినిమా సక్సెస్ ఫుల్ రన్ కంప్లీట్ అయ్యాక లాక్ డౌన్ మొదలైంది. ఫస్ట్ వేవ్ బిఫోర్ ఇండస్ట్రీకి దక్కిన సూపర్ హిట్ అల వైకుంఠపురములో. ఈ సినిమా సక్సెస్ ను అల్లు అర్జున్ కు కంటిన్యూ చేసింది పుష్ప. సేమ్ సీన్ …ఆడియో సూపర్ హిట్. తన స్వీట్ రైవల్ థమన్ కు ఏమాత్రం తగ్గకుండా మ్యూజిక్ కంపోజ్ చేశాడు దేవి. పుష్ప లో దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, ఊ అంటావా మావా, ఏయ్ బిడ్డా…ఇలా ప్రతి పాటా ఛాట్ బస్టరే. మొత్తంగా పుష్ప పాటలన్నీ వన్ బిలియన్ ..అంటే వంద కోట్ల వ్యూస్ కు చేరాయి.

ఇలా తన రెండు చిత్రాల ఆడియో వెను వెంటనే వన్ బిలియన్ వ్యూస్ కు చేరడం అల్లు అర్జున్ క్రియేట్ చేసిన రేస్ట్ రికార్డ్. వరుసగా వన్ బిలియన్ మార్క్ చేరిన సినిమాలను తన హ్యాట్రిక్ డైరెక్టర్లతో చేయడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అలవైకుంఠపురములో చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. అలాగే ఆర్య, ఆర్య 2 తర్వాత పుష్పతో సుకుమార్ తో ఘన విజయం దక్కింది.

Image

Image

Related Posts