కరోనా బారిన ప్రియాంక జవాల్కర్

యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కరోనా బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రియాంక వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు ప్రియాంక తెలిపారు.

ప్రియాంక ఇన్ స్టాలో స్పందిస్తూ..ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా బారిన పడ్డాను. ఇటీవల నన్ను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నాను. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను. మీరంతా కరోనా నిబంధనలు పాటించాల్సింది నా రిక్వెస్ట్. అని పేర్కొన్నారు. టాక్సీవాలా సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రియాంక జవాల్కర్…ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం, తిమ్మరుసు చిత్రాలతో పేరు తెచ్చుకుంది.

Related Posts