“అఖండ” హాఫ్ సెంచరీ, టాలీవుడ్ లో మళ్లీ నవ శకం

నట సింహం బాలకృష్ణ అఖండ టాలీవుడ్ లో హిస్టరీ రిపీట్ చేసింది. మళ్లీ నిన్నటి రోజులను గుర్తు చేస్తూ 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. డిసెంబర్ 2న విడుదలైన అఖండ ఇవాళ్టికి హాఫ్ సెంచరీ కొట్టింది. 103 సెంటర్స్ లో అర్థ శత దినోత్సవం జరుపుకోవడం గత దశాబ్దంన్నర కాలంలో ఇదే తొలిసారి. బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో అఖండ క్యారెక్టర్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. థియేటర్లు శివ నామస్మరణతో మార్మోగాయి. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కిన అఖండ…అనేక అవరోధాల మధ్య విడుదలై అఖండ విజయాన్నే సాధించింది. సినిమాపై నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పెట్టుకున్న నమ్మకం ఆయనే నమ్మలేనంత నిజమై ఆశ్చర్యపరిచింది.

కోవిడ్ పరిస్థితులు ఇంకా చక్కబడలేదు..అప్పటికే చాలా రోజులుగా సినిమా షూటింగ్ కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అనుకున్న టైమ్ కు ఏదీ జరగలేదు. ఎంతో శ్రమకోర్చి సినిమా కంప్లీట్ చేయగానే రిలీజ్ కు ఆటంకాలు మొదలయ్యాయి. అన్ సీజన్ అని కొందరు, సంక్రాంతికి రిలీజ్ చేయొచ్చు కదా అని మరికొందరు కామెంట్స్ చేశారు. కానీ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ధైర్యంగా సినిమా విడుదలకే మొగ్గు చూపారు. ప్రతికూల పరిస్థితుల్లో అఖండ థియేటర్ లలో డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫస్ట్ డే ఫ్యాన్స్, మాస్ ఊగిపోయారు. బుల్ ఫైట్స్, అఖండ క్యారెక్టర్ యాక్షన్ సీన్స్, ఆ పాత్రలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్, పాటలు, డాన్సులు,…ఇలా ప్రతీదీ థియేటర్ లను ఊపేశాయి. అతి కొద్ది సినిమాలకు మాత్రమే జరిగే బాక్సాఫీస్ మ్యాజిక్ అఖండకు జరిగింది. సినిమా ఊపందుకుంది, ఫ్యాన్స్, మాస్ నుంచి ఫ్యామిలీస్ దాకా అఖండ క్రేజ్ పెరిగింది. ఫలితమే ఈ లాంగ్ రన్, ఈ హిస్టారికల్ సక్సెస్.

Image
ఇలా ఓ తెలుగు సినిమా 50 రోజుల ప్రదర్శన జరుపుకోవడం గత దశాబ్దంన్నరగా లేదనే చెప్పాలి. లేట్ 2000 ఇయర్ నుంచి సినిమా వారాలకు ఆ తర్వాత రోజులకు పడిపోయింది. ఈ వారం నిలబడితే చూద్దామనే పరిస్థితి ఏర్పడింది. స్టార్స్ సినిమాలు కూడా వారమే అనే అంచనాలు ఏర్పడ్డాయి. చిన్న సినిమాలు శుక్రవారం విడుదలేతే సోమవారం పత్తా లేకుండా పోయేవి. అప్పట్లో సినిమాల సక్సెస్ ను అవి ప్రదర్శించబడిన శతదినోత్సవ కేంద్రాలను బట్టి తేల్చేవారు. నరసింహనాయుడు ఇన్ని కేంద్రాలు, రాజా అన్ని కేంద్రాలు, నువ్వు వస్తావని హండ్రెడ్ డేస్ కు ఒక నెంబర్, ఇంద్రకు ఇంకో మెస్మరైజింగ్ ఫిగర్, ఒక్కడుకు మరోలా, సింహాద్రికి ఇంకోలా…ఇలా స్టార్స్, ఎమర్జింగ్ స్టార్స్ సినిమాలన్నీ హండ్రెడ్ డేస్ థియేటర్స్ సంఖ్యను ఆధారంగా సక్సెస్ గ్రేట్ నెస్ తేల్చేవారు. ఆ తర్వాత కలెక్షన్స్ సినిమాల రేంజ్ ను చెప్పడం మొదలుపెట్టాయి. ఫస్ట్ వీక్ ఎంత, డే వన్ ఎంత, ఓవర్సీస్ ఎంత…ఇలా వసూళ్లకు విజయానికి ముడిపడింది. ఇలాంటిటైమ్ లో మళ్లీ వింటేజ్ డేస్ ను గుర్తు చేసింది అఖండ.

Image

Related Posts