మూడు రోజులకే రూ.356 కోట్లు

బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్‘ ప్రభంజనం కొనసాగుతోంది. ఈ సినిమాకి తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చినా.. సినిమా నివిడి పెద్దగా ఉందనే విమర్శలు వినిపించినా.. అవేమీ కలెక్షన్ల మీద ప్రభావం చూపించలేకపోయాయి. ఓ కల్ట్ మూవీగా ‘యానిమల్‘ వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.356 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది. మరోవైపు అమెరికాలో 6 మిలియన్ డాలర్స్ ను కొల్లగొట్టింది.

ఎప్పుడూ పెర్ఫామెన్స్ ను పీక్స్ లో చూపించే రణ్ బీర్.. ‘యానిమల్‘తో తన నటన మరో లెవెల్ అని నిరూపించాడు. ఈ సినిమా రణ్‌బీర్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా అతన్ని ఆన్ స్క్రీన్ పై ఆవిష్కరించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణ్ బీర్ లుక్స్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, కళ్ళతో ఎమోషన్స్ ను పలికించిన తీరు అబ్బురపరిచేలా ఆకట్టుకున్నాయి. విడుదలైన మూడు రోజుల్లోనే తెలుగులో ‘యానిమల్‘ బ్రేక్ ఈవెన్ సాధించిందంటున్నారు. మరి.. లాంగ్ రన్ లో ‘యానిమల్‘ ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.

Related Posts