కొత్త సినిమాని ప్రకటించిన యశ్

‘బాహుబలి‘ కోసం ప్రభాస్ ఐదేళ్లు సమయాన్ని కేటాయించినట్టే.. కన్నడ స్టార్ యశ్ కూడా దాదాపు ఐదేళ్ల తన సమయాన్ని ‘కె.జి.యఫ్‘ కోసం కేటాయించాడు. అది మామూలుగా వర్కవుట్ అవ్వలేదు. అంతకుముందు వరకూ కేవలం కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైన యశ్ ని.. ‘కె.జి.యఫ్‘ పాన్ ఇండియా స్టార్ గా మార్చింది. ఇక.. ‘కె.జి.యఫ్ 2‘ విడుదలై ఏడాదిన్నర దాటిపోయినా ఇప్పటివరకూ కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే.. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది.

యశ్ 19వ సినిమాకి ముహూర్తం ఫిక్సైంది. డిసెంబర్ 8న యశ్ 19కి సంబంధించి అనౌన్స్ మెంట్ రాబోతుంది. అందుకు సంబంధించిన క్వశ్చన్ మార్క్ తో కూడిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
కన్నడలో డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతుంది. అలాగే.. యశ్ 19 కి దర్శకత్వం వహించేది ఎవరు? నటీనటులు ఎవరు? అనే విషయాలు ఆరోజే తెలియనున్నాయి. ‘కె.జి.యఫ్‘ తర్వాత రాకింగ్ స్టార్ యశ్.. శంకర్ డైరెక్షన్ లో నటిస్తాడని.. లోకేష్ కనకరాజ్ తో సినిమా చేస్తాడనే ప్రచారం జరిగింది. అతని డైరెక్టర్స్ లిస్టులో మలయాళం డైరెక్టర్ గీతూ మోహ‌న్ దాస్ పేరు కూడా వినిపించింది. డిసెంబర్ 8నే యశ్ కొత్త సినిమా డైరెక్టర్ విషయంలో క్లారిటీ రానుంది.