‘గుంటూరు కారం’ వేడుకకు రంగం సిద్ధమైంది

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ప్రచారంలో స్పీడు పెంచుతోంది చిత్రబృందం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలవుతోంది. ఇంకా.. రిలీజ్ కు కేవలం ఒక వారం మాత్రం ఉంది. ఈనేపథ్యంలో.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను గ్రాండ్ లెవెల్ లో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి 6న ‘గుంటూరు కారం’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగబోతుంది. అదే రోజు ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు.

‘గుంటూరు కారం’ సినిమాపై అంతటా పాజిటివ్ బజ్ ఉంది. ఈసారి మహేష్ ఊర మాస్ అవతార్ లో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ తో పాటు.. ‘దమ్ మసాలా, కుర్చీ మడతపెట్టి’ వంటి మాస్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇంకా.. ఈ మూవీలో మరో పాటతో పాటు.. ఓ బిట్ సాంగ్ కూడా ఉంటుందట. వీటిలో ఒక పాటను మహేష్ బాబు పాడాడనే ప్రచారం జరుగుతుంది. ఇక.. ‘పలాస’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘నెక్కిలీసు గొలుసు’ను ‘గుంటూరు కారం’లో రీమిక్స్ చేశారట. ఓ మిర్చి గిడ్డంగిలో మహేష్, శ్రీలీల పై వచ్చే ఈ గీతం.. థియేటర్లలో రచ్చ రచ్చ చేయనున్నట్టు ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. మొత్తంమీద.. ముచ్చటగా మూడోసారి మహేష్-మాటల మాంత్రికుడు కాంబోలో వస్తోన్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించడం ఖాయమనే సంకేతాలందుతున్నాయి.

Related Posts