సైమా బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్ గోస్ టూ..

ఇండియాలోని ప్రతిష్టాత్మక అవార్డ్స్ లో సైమా ఒకటి. ప్రతి యేడాది అన్ని భాషల నటీనటులు, సినిమాలకు సంబంధించి వీళ్లు అవార్డ్స్ ను ప్రదానం చేస్తారు. 2022 కు సంబంధించి బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ ను రెడీ చేసింది. ఈ సారి ఆర్ఆర్ఆర్ లోని భీమ్ పాత్రకు ఎన్టీఆర్ ను బెస్ట్ యాక్టర్ గా సెలెక్ట్ చేశారని దాదాపు ఖాయమైంది.

ఈ సినిమాలో ఆయన నటనకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. అసలు జాతీయ అవార్డే వస్తుందనుకున్నారు. కానీ అల్లు అర్జున్ కు వెళ్లింది. అయితే ఎన్టీఆర్ కు ఇస్తే మళ్లీ రామ్ చరణ్ తో షేర్ చేయాల్సి వస్తుందనే కారణంతోనే ఆయనకు అవార్డ్ ఇవ్వలేదు అనే మాటా వినిపించింది. అయితే నేషనల్ అవార్డ్ మిస్ అయినా.. ఆ స్థాయిది కాకపోయినా కాస్త ప్రతిష్టాత్మకంగానే చెప్పుకునే సైమా అవార్డ్ కు ఎన్టీఆర్ ఎంపికయ్యాడు. ఇప్పటికే ఆయన అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొనేందుకు ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లాడు.


ఇక సైమా అవార్డ్ రావడం ఎన్టీఆర్ కు ఇది రెండోసారి. ఇంతకు ముందు జనతా గ్యారేజ్ సినిమాకు ఆయన ఈ అవార్డ్ అందుకున్నాడు. ఇది రెండో అవార్డ్. బట్ నేషనల్ అవార్డ్ వచ్చి ఉంటే బావుండేది అని ఫ్యాన్స్ ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు. ఇక ఉత్తమ నటుడుగా తెలుగు నుంచి ఎన్టీఆర్ ఈ అవార్డ్ అందుకుంటుంటే.. ఉత్తమ నటిగా 2022కు గానూ సీతారామం సినిమాకు మృణాల్ ఠాకూర్ ఎంపిక కావడం విశేషం.

ఈ చిత్రంలోనూ ఆమె నటనకు అద్భుతమైన అప్లాజ్ వచ్చింది.. ఈ మూవీతోనే ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారబోతోంది.

Related Posts