ఐకన్ స్టార్ కోసం అనిరుధ్

ఐకన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో సినిమా సెట్ అయినట్టుగానే కనిపిస్తోంది. జవాన్ కు మూడు వారాల ముందు నుంచీ ఈ కాంబినేషన్ గురించిన వార్తలు వస్తున్నాయి. అవి నిజమే అని స్వయంగా అల్లు అర్జున్ చేసిన వాట్సాప్ చాట్ తో తేలిపోయింది.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 చేస్తున్నాడు. పుష్పకు నేషనల్ అవార్డ్ రావడం ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. వాటిని డబుల్ చేసేందుకు టైమ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువే తీసుకుంటున్నారు. ఈ కారణంగానే సమ్మర్ లో వస్తుందనుకున్న పుష్ప ది రూల్ ను ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నాం అని ప్రకటించి ఆశ్చర్యపరిచారు.


అట్లీ కంటే ముందు అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాల్సి ఉంది. ఈ మూవీ ఆల్రెడీ అఫీషియల్ గానే అనౌన్స్ అయింది. త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ కు ఇది నాలుగో సినిమా అవుతుంది. ముందు వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో మూడూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఒక రకంగా అల వైకుంఠపురములో బన్నీకి దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చింది. ఈ మూవీ పాటలతో ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ కు ఇన్ డైరెక్ట్ గా పరిచయం అయ్యాడు.


ఇక అట్లీతో సినిమా విషయంలో జవాన్ రిజల్ట్ కోసం చూశాడు. జవాన్ ప్రస్తుతం కంట్రీ మొత్తం కలెక్షన్స్ తో షేక్ చేస్తోంది. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందనే అంచనాలున్నాయి. అందుకే అతనికి ఛాన్స్ ఇచ్చినట్టే అని డిక్లేర్ అయింది. అట్లీ డైరెక్షన్ లో సినిమా గురించి అఫీషియల్ గా చెప్పలేదు కానీ అల్లు అర్జున్.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో చేసిన ట్విట్టర్ చాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఇది అట్లీతో సినిమా కోసమా.. లేక త్రివిక్రమ్ సినిమా కోసమా అన్నది తేలాల్సి ఉంది. బట్ తనకు అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్ కు అనిరుధ్ .. ” థ్యాంక్యూ మై బ్రో ” అని ట్వీట్ చేశాడు. దానికి అల్లు అర్జున్.. ” సింపుల్ గా థ్యాంక్స్ చెబితే సరిపోదు.. అద్భుతమైన పాటలు కూడా కావాలి..” అంటే.. ‘రెడీ’ అని రిప్లై ఇచ్చాడు అనిరుధ్.


సో.. త్రివిక్రమ్, అట్లీ ఈ ఇద్దరిలో ఎవరి సినిమాకు అనిరుధ్ సంగీతం చేస్తున్నాడనేది పెద్ద పజిలేం కాదు. మాగ్జిమం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకే అనిరుధ్ పనిచేస్తున్నాడు అనేది టాలీవుడ్ నుంచి స్ట్రాంగ్ గా వినిపిస్తోన్న మాట.

Related Posts