కాంతార కోసం రిషభ్ కష్టాలు

ఈ మధ్య కాలంలో.. ఆ మాటకొస్తే ఈ డెకేడ్ లో అనూహ్యంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిత్రాలు కన్నడ పరిశ్రమ నుంచి వచ్చాయి. మొదటిది కేజీఎఫ్‌. రెండోది కాంతార. రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ రెండు సినిమాలపై విడుదలయ్యేంత వరకూ ఆడియన్స్ లో ఏ అంచనాలూ లేవు. అదే టైమ్ లో ఈ చిత్రాలు కన్నడ పరిశ్రమను ప్యాన్ ఇండియన్ మార్కెట్ లోనూ తోపులుగా నిలబెట్టాయి. రివ్యూస్ తర్వాతే ఈ సినిమాలు ప్యాన్ ఇండియన్ లెవల్లో బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ముఖ్యంగా కాంతార మాత్రం మరీ అనూహ్యం. కేజీఎఫ్ కు ముందు నుంచీ కొంత రాజమౌళి సపోర్ట్ ఉంది.

కాంతార కేవలం రివ్యూస్ ద్వారానే ఇతర భాషల్లో డబ్ అయింది. అలా కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 350 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. కేవలం కంటెంట్ బలంతోనే కాసులు కొల్లగొట్టింది. గ్రాఫిక్స్ లేవు, విజువల్ ఎఫెక్ట్‌స్ లేవు. పైగా కర్ణాటకలోని ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితైన సంస్కృతి కథ ఇది. అయినా దేశం మొత్త కనెక్ట్ అయింది. అంత పెద్ద విజయం సాధించింది.

ఇక ఈ చిత్రానికి ప్రీక్వెల్ మొదలుపెట్టాడు రిషభ్ శెట్టి. అంటే మనం కాంతారలో చూసిన దానికి ముందు ఏం జరిగింది అని. కాంతార చిత్రాన్నే 17వ శతాబ్దంలో మొదలుపెట్టి.. 1990ల కాలంలో సాగే కథగా చూపించాడు. అయితే ఈ సారి 4వ శతాబ్దంలో సాగే కథలా దీన్ని మలిచారట. అంటే ఈ సారి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ బాగానే అవసరం అవుతాయి.


ఇక ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సారి ఏకంగా 150 కోట్ల బడ్జెట్ కేటాయించింది నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్. ఆ మేరకు కథ ఎప్పుడో పూర్తి చేసుకున్నాడు రిషభ్. ఈ సారీ తనే మెయిన్ లీడ్ చేస్తున్నాడు. హీరోయిన్ మారుతుంది. ఇక ఈ సినిమా కోసం రిషభ్ శెట్టి 12 కిలోల బరువు తగ్గాడు. బాగా సన్నగా ఉంటేనే ఆ పాత్రకు ఫిట్ అవుతారట. అందుకే చాలా హార్డ్ వర్క్ చేసి మరీ బరువు తగ్గాడట. ఈ ప్రాసెస్‌ ను కృత్రిమంగా కాక కాస్త ఆర్గానిక్ గానే ప్లాన్ చేసుకున్నాడట. అంటే ఆ తర్వాత ఆరోగ్య పరమైన సమస్యలు రాకుండా చూసుకోవడం కోసమే అలా చేశాడు. మొత్తంగా వచ్చే సమ్మర్ లోనే విడుదలవుతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ సాధ్యం కాదు అనేది శాండల్ వుట్ టాక్.

Related Posts