మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా ముహూర్తాన్ని పూర్తి చేసి.. షూటింగ్ మొదలుపెడతారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంకోసం కొన్ని సెట్స్ ను మాత్రం నిర్మిస్తున్నారట. అలాగే.. ఈ అడ్వంచరస్ థ్రిల్లర్ కోసం మహేష్ బాబు మేకోవర్, ట్రైనింగ్ సెషన్స్ జరుగుతున్నాయి.

పాన్ వరల్డ్ రేంజులో తెరకెక్కే ‘ఎస్.ఎస్.ఎమ్.బి 29‘లో మహేష్ తప్ప మిగతా నటీనటుల గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. లేటెస్ట్ గా ఈ మూవీలో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ నటించబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. మాలీవుడ్ లో 100కి పైగా సినిమాలు చేసిన స్టార్ హీరో పృథ్వీరాజ్. ‘సలార్‘తో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడయ్యాడు.

‘ఎస్.ఎస్.ఎమ్.బి. 29‘లోని ఓ కీలక పాత్ర కోసం పృథ్వీని అనుకుంటున్నాడట జక్కన్న. తన సినిమాల్లో పలు భాషల నుంచి నటీనటులను ఎంచుకోవడం రాజమౌళికి అలవాటే. ఈసారి మాలీవుడ్ నుంచి పృథ్వీరాజ్ ను తీసుకోబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. త్వరలోనే.. ‘ఎస్.ఎస్.ఎమ్.బి. 29‘లో పృథ్వీరాజ్ ఎంట్రీపై ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.

Related Posts