HomeMoviesటాలీవుడ్బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

-

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్ పోరుకు సై అంటే సై అంటాడు. ఈకోవలోనే బాలకృష్ణ తన 109వ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. అయితే.. ఇప్పటికే దసరా బరిలో ఎన్టీఆర్ ‘దేవర‘ విడుదల తేదీ ఖరారు చేసుకుంది.

‘దేవర‘ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రిలీజవుతోంది. అన్ని భాషలను దృష్టిలో పెట్టుకుని దసరా సీజన్ బాగుంటుందని భావించిన టీమ్.. అక్టోబర్ 10న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. మరోవైపు తమిళం నుంచి రజనీకాంత్ ‘వెట్టైయాన్‘ అదే టైమ్ కు రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పుడు బాలకృష్ణ 109 కూడా దసరా పైనే ఫోకస్ పెట్టడం ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశం అయ్యింది.

ఒకవేళ.. సెప్టెంబర్ 27న ‘ఓజీ‘ రాకపోతే.. ఆ తేదీన కూడా ‘దేవర‘ వచ్చే అవకాశం ఉందంటూ మరో ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. అలాగే.. ‘ఎన్.బి.కె. 109‘ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘దేవర‘ హక్కులను పొందిందనే ప్రచారం కూడా ఉంది. ఒకవేళ నాగవంశీ ‘దేవర‘ హక్కులు పొంది ఉంటే.. బాబాయ్-అబ్బాయ్ మధ్య క్లాష్ కు ఆయన ఏమాత్రం ఆసక్తి చూపించరు. మొత్తంమీద.. దసరా బరిలో బాలయ్య-తారక్ మధ్య క్లాష్ ఉందా? లేదా? తెలియాలంటే ‘ఎన్.బి.కె. 109‘ రిలీజ్ డేట్ వచ్చే వరకూ ఆగాల్సిందే.

ఇవీ చదవండి

English News