తంత్ర రివ్యూ

టీజర్ , ట్రైలర్‌లతో విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన సినిమా తంత్ర. అనన్య నాగళ్ల మెయిన్ లీడ్‌తో బ్లాక్‌మ్యాజిక్‌ , ఆత్మలు, పిశాచాలు, క్షుద్ర పూజలు లాంటి అంశాలతో కట్ చేసిన ప్రమోషనల్ వీడియోస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో తంత్రపై హర్రర్ మూవీ లవర్సే కాకుండా న్యూట్రల్ ఆడియెన్స్‌కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా అని వెయిట్ చేసారు. మార్చి 15 న రిలీజ్‌ అయ్యింది. మరి అంచనాలకు తగ్గట్టు సినిమా ఉందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ – చిన్నతనంలోన తల్లని కోల్పోయి తండ్రితో తిట్లు తినే యువతి రేఖ ( అనన్య నాగళ్ల). ఆమెకు దెయ్యాలు , ఆత్మలు కనిపిస్తుంటాయి. ఫ్రెండ్ తేజా (ధనుష్‌ రఘుమద్రి)ను ప్రేమిస్తుంది. అతను కూడా ప్రేమిస్తాడు. అయితే రేఖ పై క్షుద్ర పూజలు చేసారని తెలుసుకుంటాడు తేజ. 8 ఏళ్లు ఊరికి దూరంగా ఉన్న విగతి (‘టెంపర్’ వంశీ), మళ్లీ వచ్చిన తర్వాత రేఖకు కష్టాలు ఎందుకు మొదలయ్యాయి?ప్రతి పౌర్ణమి నాడు రక్తదాహంతో తపించే ఆత్మ / పిశాచి రేఖ దగ్గరకు ఎందుకు వస్తుంది? వజ్రోలి రతిని ఎవరు ఎవరి మీద ప్రయోగించారు? రాజేశ్వరి (సలోని) ఎవరు?రేఖను కాపాడటం కోసం తేజా ఏం చేశారు? ఇది తెరమీద చూడాల్సిందే.


దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి రాతలో విషయం ఉంది. తాంత్రిక విద్యలు, క్షుద్రపూజలు నేపథ్యంలో క్యూరియాసిటీ క్రియేట్ చేసే పాయింట్ రాసుకున్నారు. కానీ, దర్శకత్వంలో సీరియల్ కంటే స్లోగా తీశారు. అనన్యకు దెయ్యాలు కనిపించడం తప్ప ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమీ లేదు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథతో పాటు క్షుద్ర పూజల గురించి చెప్పే విషయాలు సాధారణంగా ఉంటాయి.

నటీనటులు –
రేఖగా మెయిన్ లీడ్ రోల్ చేశారు అనన్యా నాగళ్ల పతాక సన్నివేశాల్లో ఆమెకు నటించే స్కోప్ దక్కింది. బాగా చేశారు. సలోని రోల్, ఆ సీన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఎమోషనల్ సీన్స్ లో చక్కగా నటించింది. టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరుల నటన వల్ల ఆయా పాత్రలు రిజిస్టర్ అయ్యాయి. స్క్రీన్‌పై ధనుష్‌ రఘుమద్రి చక్కగా కనిపించాడు. మంచి ఫీచర్ ఉన్న నటుడు అనిపించుకున్నాడు.

టెక్నిషియన్స్ –
ఈ సినిమాకి రచన పరంగా ఆకట్టుకున్నా.. స్లో నేరేషన్‌, బలం లేని సీన్స్ తో ఆకట్టుకోలేకపోయాడు. ఆర్ ఆర్ ధృవన్ సంగీతం బాగుంది. టెక్నికల్ వేల్యూస్ బావున్నాయి.

బోటమ్‌ లైన్ – సాదా సీదా తంత్ర

Related Posts