భీమా థ్యాంక్స్‌ మీట్‌

యాక్షన్ స్టార్ గోపీచంద్, ప్రియా భవాని శంకర్ , మాళవిక శర్మ మెయిన్‌లీడ్ తో కెకె రాధామోహన్‌ నిర్మాణ సారధ్యంలో ఎ. హర్ష డైరెక్షన్‌లో రూపొందిన సినిమా భీమా. ఈ సినిమా మార్చి 8 న రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా థాంక్స్ మీట్ నిర్వహించింది. దర్శకులు మారుతి, సంపత్ నంది ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.


గ్రాఫిక్స్, యాక్షన్, కామెడీ అద్భుతంగా వుంటాయి. మా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మారుతి, సంపత్ నంది గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మంచి కథ తీసుకొచ్చి, ఆడియన్స్ కి ఏం కావాలో అలాంటి మంచి కమర్షియల్ ప్యాక్డ్ సినిమా ఇచ్చిన హర్షకి థాంక్స్. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించి ఇంత మంచి సినిమా ఇచ్చిన రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి ధన్యవాదాలు అన్నారు గోపీచంద్. అలాగే ఈ చిత్రంలో రెండు వేరియేషన్స్‌ లో తను ఇచ్చిన పర్‌ఫార్మెన్స్‌కి మంచి అప్లాజ్ వచ్చిందన్నారు.
ఓవైపు పిల్లల పరీక్షలు, మరోవైపు రిలీజైన సినిమాలు.. ఇన్ని ఉన్నా భీమాకు మంచి ఆదరణ దక్కిందన్నారు డైరెక్టర్ మారుతి. గోపీచంద్ గారికి మాస్ ఆడియన్స్ పల్స్ తెలుసు. క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలెట్. సినిమాలో చాలా మంచి ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ వుంది. అందరూ తప్పకుండా చూడండి. ఎంజాయ్ చేస్తారన్నారాయన. క్లైమాక్స్ ఫైట్ చూస్తున్నపుడు పరశురాముడు అంటే ఇలానే ఉంటాడేమో అనిపించింది. అంత బాగా ప్రజెంట్ చేసింది హర్ష గారికి థాంక్స్. రాధమోహన్ సినిమాని టాప్ క్లాస్ లో నిర్మించారు. గోపీచంద్ గారిని అద్భుతంగా ప్రజెంట్ చేసి ఈ సినిమాని తీసునందుకు ఆయనకి అభినందనలు అన్నారు డైరెక్టర్ సంపత్‌నంది.


ఇది నా మొదటి తెలుగు సినిమా. నాకు సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇంత మంచి సినిమాని ఇచ్చిన నిర్మాత రాధమోహన్ గారికి, సహా నిర్మాత శ్రీధర్ గారికి ధన్యవాదాలు అన్నారు చిత్ర దర్శకుడు ఎ. హర్ష. మారుతి, సంపత్ నంది గారికి ధన్యవాదాలు తెలిపారు.
చిత్ర విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసారు హీరోయిన్ మాళవిక శర్మ.
భీమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పుడు పరీక్షలు పూర్తయ్యాయి. రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. పిల్లలు, పేరెంట్స్ కలసి ఈ సినిమా చూసి, నెక్స్ట్ వీక్ కలెక్షన్స్ ఇంకా బాగా పెరుగుతాయని భావిస్తున్నాం అన్నారు నిర్మాత కెకె రాధామోహన్‌. థ్యాంక్స్ మీట్ కు వచ్చిన డైరెక్టర్లు మారుతి, సంపత్‌ నందిలకు ధన్యవాదాలు తెలియజేసారు.

Related Posts