‘దీనమ్మ జీవితం’ మూవీ రివ్యూ.. సినిమా నేపథ్యంలో బోల్డ్ మూవీ

నటీనటులు: దేవ్‌ బల్లాని , ప్రియ చౌహాన్‌, సరిత చౌహాన్ తదితరులు
సంగీతం: ఆర్ ఎస్
నిర్మాతలు: వై.మురళి కృష్ణ, వై.వెంకటలక్ష్మీ, డి.దివ్య సంతోషి, బి.సోనియా
దర్శకత్వం: మురళి రామస్వామి
విడుదల తేదీ: జనవరి 5, 2024

దేవ్‌ బల్లాని , ప్రియ చౌహాన్‌, సరిత చౌహాన్ ప్రధాన పాత్రల్లో ‘ప్రేమ పిపాసి’ ఫేం మురళి రామస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దీనమ్మ జీవితం’. వై.మురళి కృష్ణ, వై.వెంకటలక్ష్మీ, డి.దివ్య సంతోషి, బి.సోనియా నిర్మించారు. రా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం
ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ను ఆకట్టుకుందా? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
క్రిష్ అలియాస్ కృష్ణ (దేవ్ బల్లాని) సినిమాల్లో డైరెక్షన్ అవకాశాలకోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతనికి భార్య రాధ (ప్రియా చౌహాన్), ఓ కూతురు ఉంటుంది. అయితే మరో అమ్మయి మహి అలియాస్ మహిమ (సరిత చౌహాన్)తో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో తరచు గొడవ పడుతూ… కెరీర్లో సెటిల్ అవ్వకుండా ఆపసోపాలు పడుతూ ఉంటాడు. తన భర్త మరో అమ్మాయితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వున్నాడని తెలుసుకుని రాధ ఎంతో బాధపడుతుంది. దారి తప్పిన తన భర్తను ఎలాగైనా దారికి తెచ్చుకొని సంసారాన్ని చక్కదిద్దుకోవాలనుకుంటుంది. మరి.. రాధ తన భర్తను దారికి తెచ్చుకోగలిగిందా? మహిమ పరిస్థితి ఏంటి? అనేది మిగతా స్టోరీ.

విశ్లేషణ:
సినిమా ఇండస్ట్రీ.. అందులో స్థిరపడాలనుకునే నటీనటుల పైనా.. సాంకేతిక నిపుణుల పైనా ఇప్పటికే పలు చిత్రాలొచ్చాయి. ఈ సినిమా కూడా అదే నేపథ్యంలో సాగుతుంది. అన్యోన్యంగా ఉండే ఇద్దరు భార్యాభర్తల మధ్య మరో అమ్మాయి ఎంటర్ అయితే ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులకు గురవుతుంది.. దాని వల్ల అతని కెరీర్ ఎంత ఎఫెక్ట్ అవుతుందనేది ఈ మూవీలో రస్టిక్ గా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో బోల్డ్ రొమాన్స్ తో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసి.. సెకండ్ హాఫ్ లో హీరో, హీరోయిన్స్ ఫ్లాష్ బ్యాక్ చూపించి పాత్రలకు జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్.

నటీనట, సాంకేతిక వర్గం
దేవ్ ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే అబ్బాయిగా… కెరీర్ లో స్టిరపడాలనుకునే అప్ కమింగ్ డైరెక్టర్ గా తన పాత్రకు న్యాయం చేశాడు. మహి పాత్రలో సరిత చౌహాన్ బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. గృహిణి పాత్రలో ప్రియా చౌహాన్ సరిగ్గా సరిపోయింది. పరాయి అమ్మాయి మోజులో దారి తప్పిన భర్తను ఎలా దారికి తెచ్చుకునే ఓ సిన్సియర్ గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

గతంలో ప్రేమకోసం తపించే ఓ పిచ్చి ప్రేమికుని కథతో ‘ప్రేమ పిపాసి’ తీసిన చిత్ర దర్శకుడు మురళి రామస్వామి.. ఈసారి మనసుకు నచ్చిన ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయే భర్త.. తన ప్రియుడికోసం పరితపించే ఆమ్మాయి మహి పాత్రను నేటి యువతకు కనెక్ట్ అయ్యేలా చూపించారు. కొన్ని బోల్డ్ సీన్స్ చూస్తే ‘యానిమల్’ మూవీ గుర్తుకు రాక మానదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం పర్వాలేదు.. ఐటెం సాంగ్ యూత్ కి కనెక్ట్ అవుతుంది.. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Related Posts