షాకింగ్ న్యూస్.. నేత్రా రెడ్డి, వంశీ కృష్ణా రెడ్డి విడిపోయారు

సినిమా స్టార్స్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఆయా రంగాలకు సంబంధించిన కంటెంట్ తో రీల్స్, వీడియోస్ చేస్తూ.. ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంటున్నారు. అలాంటి వారిలో నేత్రా రెడ్డి ఒకరు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న నేత్రా రెడ్డి.. ఆర్గానికి ఫార్మింగ్ లో ఉన్నత స్థానానికి వెళ్లింది. తన ఫార్మింగ్ కి సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఫార్మర్ గా కంటే ముందే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ‘ప్రేమకథ’ అనే సినిమా చేసింది. అలా.. ఫార్మర్ నుంచి హీరోయిన్ గా కూడా మారింది నేత్రా రెడ్డి.

ఈ రంగంలో నేత్రాకి సపోర్ట్ గా నిలబడిన మరో సోషల్ మీడియా స్టార్ వంశీ కృష్ణా రెడ్డి. వీరిద్దరూ ప్రేమించుకుని ఒక్కటయ్యారు. అయితే.. ఇద్దరూ కలిసి ఎదుగుతోన్న ఈ తరుణంలో ఇద్దరూ విడిపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రెండు సంవత్సరాల పాటు కలిసున్న తామిద్దరూ మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో విడిపోతున్నట్టు ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఎవరికి వారు ప్రకటించారు. తమ పర్సనల్ డెసిషన్స్ ను అందరూ గౌరవించి.. తమకు సపోర్ట్ ఇవ్వాలని వీరిద్దరూ తమ నోట్ లో పేర్కొన్నారు.

Related Posts