పక్కా ప్లానింగ్ తో పూర్తైన ‘నా సామిరంగ’

ఆగస్టులో నాగార్జున బర్త్ డే స్పెషల్ గా అనౌన్స్ అయిన ‘నా సామిరంగ’.. జెట్ స్పీడులో చిత్రీకరణ జరుపుకుంది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్షన్ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ మలయాళం చిత్రం రీమేక్ గా రూపొందినా.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమాలో చాలా మార్పులే చేశారట. ఈ చిత్రం మొదలైనప్పటినుంచీ అంతా తానే అయ్యి.. ఈ మూవీని పక్కా ప్లానింగ్ తో పూర్తిచేయించాడట కింగ్ నాగార్జున. లేటెస్ట్ గా ‘నా సామిరంగ’ షూటింగ్ మొత్తం పూర్తైనట్టు ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది టీమ్.

మరోవైపు సంక్రాంతి బరిలో రాబోతున్న ‘నా సామిరంగ’ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనూ చిత్రబృందం ఫుల్ హ్యాపీగా ఉందట. ఇప్పటికే నాన్ థియేట్రికల్ రూపంలో ఈ మూవీకి దాదాపు రూ.35 కోట్లు వచ్చాయట. ఇప్పుడు ఈ సినిమాని కింగ్ నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ పై ఓన్ గా రిలీజ్ చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన గత చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే.. నాగ్ ప్లానింగ్ తో ‘నా సామిరంగ’ విషయంలో ఇప్పటికే సేఫ్ జోన్ లోకి వెళ్లాడట ప్రొడ్యూసర్.

Related Posts