మరోసారి మ్యాజిక్ చేయబోతున్న విజయ్-పరశురామ్

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ‘గీత గోవిందం’ మంచి విజయాన్ని సాధించింది. తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మళ్లీ ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఈసారి విజయ్ కి జోడీగా లక్కీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ‘గీత గోవిందం’ వైబ్స్ తో రాబోతున్న ‘ఫ్యామిలీ స్టార్’ కూడా ఫక్తు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అలరించబోతున్నట్టు ప్రచార చిత్రాలను బట్టి తెలుస్తోంది.

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘నందనందనా..’ రిలీజయ్యింది. గోపీ సుందర్ కంపోజిషన్ లో అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా సిధ్ శ్రీరామ్ ఈ పాటను పాడాడు. ‘ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో, సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో, హృదయాన్ని గిచ్చీ గిచ్చకా..ప్రాణాన్ని గుచ్చీ గుచ్చకా..చిత్రంగా చెక్కింది దేనికో..’ అంటూ సాగిన ఈ పాట క్యాచీ ట్యూన్ తో ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లో చార్మినార్, మెట్రో ట్రైన్ లో విజయ్ వేసిన స్టెప్స్ స్పెషల్ గా ఉన్నాయి. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ విడుదలకానుంది.

Related Posts