మార్చి 23 న రిలీజ్‌ కు రెడీ అయిన ‘యమధీర’

కన్నడ హీరో కోమల్ కుమార్ , క్రికెటర్ శ్రీశాంత్ కాంబినేషన్‌లో వేదాల శ్రీనివాస్‌ నిర్మిస్తున్న మూవీ ‘యమధీర’. శంకర్ ఆర్ డైరెక్షన్‌ చేస్తున్న ఈ మూవీ టీజర్, ట్రైలర్‌ తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ఈ చిత్రంలో నాగబాబు గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధు సూధన్ గారు తదితరులు కీలకపాత్రలు పోషించారు.
చిన్న సినిమాలను సపోర్ట్ చేయడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకి సినిమాను తీసుకురాబోతున్నాం. ఈ సినిమాని ప్రేక్షకుల ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. ఈ యమధీర ఫిలిం ఈవీఎం ట్యాంపరింగ్ పైన చిత్రీకరించాము. అజర్ బైజాన్ కంట్రీ లో ఎక్కువ శాతం షూట్ చేసామన్నారు నిర్మాత వేదాల శ్రీనివాస్ రావు.

Related Posts