మాంటేజ్‌ సాంగ్ షూట్‌ లో దేవర

యంగ్ టైగర్ ,సెన్సేషనల్ మాస్ హీరో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్న మూవీ ‘దేవర’. కొరటాల శివ డైరెక్షన్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.దేవర ఫస్ట్‌లుక్‌ నుంచి భారీ గా అంచనాలు పెరిగిపోయాయి. దేవర గ్లింప్స్‌ ఇండియా వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

రీసెంట్‌ గా గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుందీ చిత్రం. దేవర మేకర్స్ సినిమా నుంచి వర్కింగ్ స్టిల్స్‌ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ, రాజు సుందరం మాస్టర్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీలో ఈ చిత్రానికి సంబంధించిన మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. ఎన్టీఆర్‌ను సరికొత్త పాత్రలో చూడటానికి ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

Related Posts