గీత గోవిందం మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

అనెక్స్ పెక్టెడ్ హిట్స్ అని కొన్ని ఉంటాయి. కొన్నాళ్ల క్రితం తెలుగులో వచ్చిన గీత గోవిందం సినిమా అలాంటిదే. అప్పటి వరకూ చిన్న సినిమాలు చిన్న హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చిన డైరెక్టర్ పరశురామ్ అదే పంథాలో అప్పటికి చాలా చిన్న హీరోనే అయిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా గీత గోవిందం చిత్రాన్ని తెరకెక్కించాడు.

విడుదలకు ముందే గోపీ సుందర్ సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. దీనికి తోడు హీరో హీరోయిన్ల సోషల్ మీడియా రొమాన్స్ కూడా సినిమాను బాగా ప్రమోట్ అయ్యేలా చేసింది. కట్ చేస్తే రిలీజ్ తర్వాత అనూహ్యమైన టాక్ తో అద్బుతమైన వసూళ్లు సాధించింది. ఎంటర్టైన్మెంట్, లవ్, సెంటిమెంట్ అన్నీ మిక్స్ అయిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది.

ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిందీ మూవీ. నిజానికి ఈ మూవీకి ముందే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో యూత్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ మూవీకి పూర్తి భిన్నంగా చాలా సాఫ్ట్ గా ఉండటం కూడా జనాలకు బాగా నచ్చింది. ఇక చాలాకాలం తర్వాత కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అన్న పేరూ రావడంతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ విజయంలో పాటలకు పెద్ద స్థానం ఉందనేది మర్చిపోలేని అంశం.
ఇక ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది.

అనేక ఇష్యూస్ తర్వాత రీసెంట్ గా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. అయితే అందరూ మళ్లీ రష్మిక మందన్నానే హీరోయిన్ అనుకున్నారు. బట్ తనను కాదని పూజాహెగ్డే పేరు వినిపించింది. తీరా ఓపెనింగ్ కు ముందు రోజు పూజాను కాదని సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నారు. తనతోనే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉంటాయని చెప్పాలి. గీత గోవిందంకు అల్లు అరవింద్ నిర్మాత.

కానీ ఈ సారి దిల్ రాజు. ఈ విషయంలోనే కొన్ని ఇష్యూస్ వచ్చాయి టాలీవుడ్ లో. అయినా అన్నీటిని దాటుకుని పరశురామ్ ఈ చిత్రాన్ని ప్రారంభించాడు. ఇందుకోసం విజయ్ కూడా ముందు ఒప్పుకున్న గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ను కూడా హోల్డ్ లో పెట్టాడు. అంటే ఈ కథపై అతని నమ్మకం అలాంటిది అనుకోవచ్చు.
మొత్తంగా ఈ మూవీ కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే వస్తోంది అనే టాక్ వినిపిస్తోంది. కాకపోతే కాస్త మాస్ టచ్ కూడా ఉంటుందట. పరశురామ్ ఇన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడానికి కారణమైన సర్కారువారి పాట ఆశించినంత పెద్ద విజయం సాధించలేదు.

దీంతో ఈ మూవీతో అతను మరోసారి నిరూపించుకోవాల్సి ఉంది. లేదంటే టాలీవుడ్ లో అతని మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ఇప్పటికే పరశురామ్ పై చాలామంది నిర్మాతలు కోపంగా ఉన్నారు. ఆ కోపం పోయి పాత అడ్వాన్స్ లు కూడా కొత్తగా ఇవ్వాలంటే విజయ్ దేవరకొండతో ఓ భారీ హిట్ కొట్టాలి. అప్పుడే ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ కూడా వర్కవుట్ అవుతుంది. మరి వీళ్లు గీత గోవిందం మ్యాజిక్ ను రిపీట్ చేయడం అంత సులువైతే కాదు. అప్పుడంటే ఏ అంచనాలూ లేవు. హీరో కూడా చిన్నవాడు. దర్శకుడూ అంతే. ఇప్పుడు వీరిపై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఒత్తిడిలో ఆ అంచనాలను అందుకోవడం ఈజీ కాదు. అయినా ఈ టాస్క్ లో వీళ్లు బ్లాక్ బస్టర్ కొడితే అది రికార్డులు క్రియేట్ చేస్తుందనే చెప్పాలి.

Related Posts