దృశ్యం ౩ ఇతర భాషల్లో లేదా

దృశ్యం.. మళయాలంలో వచ్చిన ఈ మూవీకి భారతదేశవ్యాప్తంగా తిరుగులేని అప్లాజ్ వచ్చింది. దీంతో దాదాపు అన్ని భాషల్లోనూ రీమేక్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైమ్.. రీమేక్ అయిన అన్ని భాషల్లోనూ అద్భుతమైన విజయాన్ని సాధించిందీ సినిమా. తెలుగులో వెంకటేష్‌, తమిళ్ లో కమల్ హాసన్, కన్నడలో రవిచంద్ర, హిందీలో అజయ్ దేవ్ గణ్ నటించారు. ఈ అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన దృశ్యం2లో కూడా వీళ్లే నటించారు మళ్లీ అన్ని చోట్లా బ్లాక్ బస్టర్. అయితే సెకండ్ పార్ట్ లోనే ఫస్ట్ పార్ట్ లో ఉన్న సస్పెన్స్ కు తెరదించారు. అయినా లేటెస్ట్ గా ఈ మూవీకి మరో సీక్వెల్ అనౌన్స్ చేశాడు దర్శకుడు జీతూ జోసెఫ్‌. అయితే ఇది కేవలం మళయాల, హిందీ భాషల్లో మాత్రమే ఉంటుందని చెప్పాడు. థర్డ్ పార్ట్ లో కూడా సేమ్ హీరోలు, కాస్టింగ్ ఉంటుంది.

ఒకేసారి చిత్రీకరణ చేసి రిలీజ్ ను కూడా ఒకే రోజు ప్లాన్ చేసుకున్నారు. అయితే అది ఎప్పుడు అనేది ఇంకా తేలలేదు. ఇందుకోసం మళయాలం నుంచి మోహన్ లాల్ హిందీ నుంచి అజయ్ దేవ్ గణ్‌ ఆల్రెడీ ఓకే చెప్పి ఉన్నారు. మరి మిగతా భాషల పరిస్థితి ఏంటీ అనేది ఇప్పుడు తేలడం లేదు.


నిజానికి వెంకటేష్‌ ఇమేజ్ కు ఈ కథ అద్భుతంగా సెట్ అయింది. అటు కమల్ కు కాస్త తక్కువే అయినా.. కన్నడలో కూడా రవిచంద్ర ఇమేజ్ కు సరిపోయింది. అయినా థర్డ్ పార్ట్ విషయంలో ఈ మూడు భాషల నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం వెంకటేష్‌ తన కెరీర్ ల్ 75వ సినిమాగా సైంధవ్ చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతోంది.

మిగతా భాషల్లో ఆయా హీరోలూ బిజీగానే ఉన్నారు. మరి వాళ్లెందుకు చేయడం లేదు.. వారిని దర్శకుడు అప్రోచ్ అయ్యి నో చెబితే హిందీ వరకూ వెళ్లాడా లేక ఇంకేవైనా కారణాలున్నాయా అనేది తెలియదు కానీ.. ఇప్పటికైతే సౌత్ లో దృశ్యం3 రీమేక్ పై ఎలాంటి అప్డేట్ లేదు. ఒకవేళ ఫస్ట్ పార్ట్ లాగా ఈ థర్డ్ పార్ట్ కూడా బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు మళ్లీ వీళ్లంతా చేస్తారేమో చూడాలి.

Related Posts