గుంటూరు కారం సమస్యేంటీ..?

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రిస్టీజియస్ గా ప్రారంభమైన కొత్త సినిమాకు సంబంధించి రెండు సార్లూ ముహూర్తం సరిగా కుదరలేదనట్టుంది. లేదంటే మొదటి ఏకంగా ఆ కథే ఆగిపోయింది. రెండో సారి వేరే కథతో మొదలుపెడితే ఇది కాస్తా.. ఎప్పుడూ ఆగుతూ సాగుతూ వస్తోంది. అయితే కొన్నాళ్ల క్రితం ఆగిపోయిన ఈ చిత్రం మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందీ అనే విషయంలో అనేక సందేహాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ నెల 10 నుంచి మొదలు అన్నారు. కాలేదు. తర్వాత 12 అంటే అప్పుడూ స్టార్ట్ కాలేదు. ఇక 16 నుంచి సెట్స్ పైకి వెళుతున్నాం అని చెప్పారు. చూస్తే ఇదీ ఆగిపోయింది.

ఇక కొత్తగా ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతున్నాం అని చెబుతున్నారు. బట్ఈ డేట్ కూడా స్టార్ట్ అయ్యేంత వరకూ గ్యారెంటీ లేదు. అయితే అసలు ఈ సినిమాకు సంబంధించి ఏం జరుగుతోందీ అని చూస్తే ప్రధానంగా రెండు విషయాల్లో సమస్యలున్నాయి. ఒకటి మహేష్ బాబు సైడ్ నుంచి. రెండు సినిమాలోని ఇతర మెయిన్ కాస్టింగ్ నుంచి.


నిజానికి ఈ చిత్రానికి ఇచ్చిన డేట్స్ లో షూటింగ్ కు హాజరు కాలేదు మహేష్‌ బాబు. దీంతో కాంబినేషన్ లో ఉన్న ఇతర ఆర్టిస్టుల డేట్స్ మారిపోయాయి. మళ్లీ వాళ్లంతా దొరకడం పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే వాళ్లేమీ చిన్న ఆర్టిస్టులు కాదు. పైగా ఇప్పుడు తీయబోయే సీన్స్ అన్నీ మెయిన్ ఆర్టిస్టుల కాంబోస్ లోనే ఉన్నాయట. ఆ సన్నివేశాల్లో ప్రధానమైన ఆర్టిస్టులంతా ఉండాల్సిందే అనేది త్రివిక్రమ్ టీమ్ చెబుతోన్న మాట.

మరి ఆ టీమ్ ఎవరూ అంటే.. శ్రీ లీల, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరాం, సునిల్ తో పాటు రమ్యకృష్ణ వంటి వారు ఉన్నారట. వీరిలో పూజాహెగ్డే పెద్ద బిజీ కాదు కాబట్టి అందుబాటులో ఉంది. బట్ శ్రీ లీల గురించి తన బర్త్ డే సందర్భంగా వచ్చిన పోస్టర్స్ చూశాం కదా..? తను ఎంత బిజీగా ఉందో ఆ పోస్టర్స్ తోనే చెప్పకనేచెప్పింది. ఇక ప్రకాష్‌ రాజ్ డేట్స్ సైతం అందుబాటులో లేవట. అటు సునిల్ కూడా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా బిజీగా ఉన్నాడు. జయరాం అన్ని భాషల్లో తిరుగుతున్నాడు. సో.. మొత్తంగా వీరందరూ ఉండాలంటే అందరి డేట్స్ దొరకాలి. దొరికినప్పుడు మహేష్‌ బాబు మిస్ చేశాడు.

మళ్లీ అందరూ ఒకే డేట్ కు రావాలంటే టైమ్ పడుతుంది. అదే ఈ చిత్రం ఆలస్యానికి అసలు కారణం అంటున్నారు. అఫ్‌ కోర్స్ అలా చూస్తే అసలు కారణం మొదట షూటింగ్ కు రాకుండా స్కిప్ చేసిన మహేష్‌ బాబే ఫస్ట్ రీజన్ అనుకోండి. మరి ఈ నెల 20 నుంచి షూటింగ్ సాగుతుందా లేదా అనేది చెప్పలేం కానీ.. వచ్చేది వానాకాలం. ఇలాగే ఆలస్యం చేస్తూ వెళితే వీళ్లు చెప్పిన సంక్రాంతికి విడుదల చేయడం కూడా కష్టమవుతుంది.

Related Posts