నితిన్, రామ్ లలో బెటర్ ఎవరు

ఇండియన్ కమర్షియల్ సినిమాలకు పాటలు ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. కథ ఏదైనా పాటలు ఉండాల్సిందే. మరీ థ్రిల్లర్స్ తరహా సినిమాలు అంటే కాస్త ఎక్స్ క్యూజ్ చేస్తారేమో కానీ సాంగ్స్ లేని సినిమాలను మనవాళ్లు ఉల్లిపాయ లేని బిర్యానీలా చూస్తారు. అందుకే పాటల విషయంలో మేకర్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక్కోసారి పాటలతోనే ఓపెనింగ్స్ తెచ్చుకుంటారు కూడా. ఈ కారణంగానే ఏ సినిమా నుంచి అయినా ఫస్ట్ సాంగ్ వస్తుందంటే ఖచ్చితంగా మొదటే మంచి ఇంప్రెషన్ వేయాలని చూస్తుంటారు.

అలా ఈ వారం కొన్ని గంటల వ్యవధిలోనే నితిన్,రామ్ సినిమాల నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్స్ విడుదలయ్యాయి. మరి వీటిలో ఎవరి పాట బావుంది. ఎవరి పాటకు ఆడియన్స్ ఎక్కువ ఓటు వేస్తున్నారు అంటే ఖచ్చితంగా నితిన్ సాంగే బావుందంటున్నారు చాలామంది. ఈ రెండు పాటల్లోనూ కామన్ గా ఉన్న హీరోయిన్ శ్రీ లీల.


నితిన్, శ్రీ లీల జంటగా వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఎక్స్ ట్రార్డినీ మేన్. ఈ మూవీలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు అనే టాక్ ఉంది. ఇక ఈ మూవీ నుంచి హారిస్ జయరాజ్ స్వరపరిచన డేంజర్ పిల్లా అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాట వినగానే ఆకట్టుకుంటోందని చెబుతున్నారు చాలామంది. ఇది హీరో తన క్యారెక్టర్ ను చెప్పడంతో పాటు అలాంటి క్యారెక్టర్ ఉన్న తను హీరోయిన్ తో ప్రేమలో పడ్డ వైనం గురించి సాగే పాట.అంటే దీనికి ఓ సందర్భం కనిపిస్తోంది. విదేశీ లొకేషన్స్ లోనే చిత్రీకరించినా.. నితిన్, శ్రీ లీల జోడీ చూడ్డానికి బావున్నట్టు అనిపించడం.. ట్యూన్ తో పాటు సాహిత్యం కూడా బావుండటంతో మరీ ఎక్స్ ట్రార్డినరీ అనకపోయినా సూపర్బ్ ఉంది పాట అనేస్తున్నారు విన్నవాళ్లంతా.


ఇక రామ్, శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన స్కంద నుంచి వచ్చిన పాట రెగ్యులర్ మాస్ డ్యూయొట్ లా ఉంది. ఇద్దరూ మంచి డ్యాన్సర్స్ కావడంతో పాటలో ఆ బీట్స్ కు ఎక్కువ ప్రాధాన్యం కనిపించింది. ట్యూన్ మరీ గొప్పగా లేకపోయినా డ్యాన్స్ చేయడానికి కావాల్సిన బీట్ ఉంది. ఆ బీట్ కు తగ్గట్టుగా రామ్, శ్రీ లీల తమ ఎనర్జీ అంతా పాటలో చూపించే ప్రయత్నం చేశారు. తమన్ ట్యూన్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే ఈ సాంగ్ ఎక్స్ ట్రార్డినరీ సాంగ్ తో పోలిస్తే కాస్త వెనకబడి ఉంది అంటున్నారు.

Related Posts