మంగళవారంకు మహా క్రేజ్

ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసి.. నెక్ట్స్ మూవీతో బోల్తా పడిన దర్శకులు చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ లో అజయ్ భూపతి ఒకడు. మొదటి సినిమా ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్ తో పాటు ఇతర భాషల ప్రేక్షకులను కూడా మెప్పించాడు.ఈ సినిమా తర్వాత అతనికి చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ అతను మాత్రం మహా సముద్రం అనే కథను పట్టుకుని దానికోసమే ఆగాడు. ఎంతోమంది వద్దకు వెళ్లి వచ్చిన ఆ కథ ఆఖరికి శర్వానంద్, సిద్ధార్థలతో చేశాడు. బట్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించుకుందీ మూవీ.

దీంతో మరో నిర్మాత అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. అయినా తనే రంగంలోకి దిగి మరోసారి ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో మంగళవారం అనే సినిమా ప్రారంభించాడు.ఈ టైటిల్ చాలామందిని ఆకట్టుకుంది. అంతకు మించి ఆ మధ్య విడుదల చేసిన టీజర్ సర్ ప్రైజ్ చేసింది.

హారర్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన థ్రిల్లర్ సినిమాలా అనిపించింది. ఇది కూడా ఒకే గ్రామంకు సంబంధించిన కథే అనిపించేలా ఉందా టీజర్. పైగా సినిమాను ప్యాన్ ఇండియన్ లెవల్లో విడుదల చేస్తున్నా అని ప్రకటించాడు. విశేషంగా అన్ని భాషల్లోనూ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. అదే ఇప్పుడు బిజినెస్ డీల్స్ కూ హెల్ప్ అవుతోందంటున్నారు.


మంగళవారం సినిమాకు భారీ బిజినెస్ అవుతుందని టాక్. అన్ని భాషల్లోనూ చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ గా ఉన్నారట. అందుకు తగ్గట్టుగానే అజయ్ భూపతి కూడా భారీ ధరలే చెబుతున్నాడు అంటున్నారు. అయినా వాళ్లు ఏమంత నెగోషియేట్ చేయకుండా కాస్త అటూ ఇటూగా మాట్లాడుతున్నారని టాక్.

అయితే అజయ్ భూపతి ముందుగా నాన్ థియేట్రికల్ రైట్స్ ను క్లోజ్ చేయాలనుకుంటున్నాడు. ఆ మేరకు శాటిలైట్, డిజిటల్ ఓనర్స్ తో చర్చలు జరుగుతున్నాయి.ఆ తర్వాత థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేస్తాడట. ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్నదాన్ని బట్టి సినిమా రిజల్ట్ తో పనిలేకుండా అజయ్ భూపతి భారీ టేబిల్ ప్రాఫిట్స్ తోనే ఈ సినిమాను విడుదల చేస్తాడు అంటున్నారు.ఇక సినిమాకు కూడా హిట్ టాక్ వస్తే కొన్నావాళ్లు కూడా ఖుష్ అవుతారు.

Related Posts