బోయపాటి, సూర్య కాంబోపై నిజం ఎంత

కొన్ని కాంబినేషన్స్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తారు. అది ఆయా స్టార్ల ఇమేజ్ ను బట్టి ఉంటుంది. కొన్నాళ్లుగా బోయపాటి శ్రీను విషయంలో ఈ రూమర్స్ బాగా వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం కన్నడ హీరో యశ్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. కేజీఎఫ్ తర్వాత బోయపాటితో సినిమా అంటే యశ్ కెరీర్ మారినట్టే అన్నారు. అది వర్కవుట్ కాలేదు.. అనే కంటే అసలు ప్లానింగ్ లోనే లేదు అనేది నిజం. ఇప్పుడు తమిళ్ స్టార్ సూర్యను బోయపాటి డైరెక్ట్ చేయబోతున్నాడు అనే వార్తలు అదే పనిగా వస్తున్నాయి. చాలామంది ఇది నిజమే అనుకుంటున్నారు కూడా. బట్ ఈ వార్తలో ఏం నిజం లేదు. కేవలం ఇది రూమర్ మాత్రమే అని కోలీవుడ్ వర్గాలు తేల్చి చెప్పాయి.


నిజానికి ఈ కాంబినేషన్ లో సినిమా అంటే బోయపాటి అగ్రెసివ్ నెస్ కు సూర్య మాస్ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అయితే ఇదేమీ ఫస్ట్ టైమ్ కాబోదు. బోయపాటి కంటే ఊరమాస్ అనిపించుకున్న సూపర్ ఫాస్ట్ డైరెక్టర్ హరితో ఆల్రెడీ ఆ తరహా సినిమాలు చేసి ఉన్నాడు సూర్య. అందువల్ల ఇది మరో యాక్షన్ సినిమా అవుతుందే తప్ప.. ఇదే ఫస్ట్ టైమ్ కాదు. పైగా బోయపాటి సినిమాలు మరీ ఓవర్ రేటెడ్ గా ఉంటాయి. అందుకు సూర్య యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే హరి డైరెక్షన్ లో సూర్య చేసిన సినిమాలన్నీ అవే. సింగం సిరీస్ లో మూడు సినిమాలు వచ్చాయి. మూడూ అలాగే ఉంటాయి. బట్ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ పెద్ద హిట్ కాదు. సెకండ్ కంటే థర్డ్ పెద్ద హిట్ కాదు. సో.. సక్సెస్ రేషియో తగ్గుతూ వచ్చింది కాబట్టి మళ్లీ ఈ ఇప్పుడప్పుడే ఈ ఓవర్ రేటెడ్ మూవీస్ చేయకపోవచ్చు.


మరోవైపు సూర్య ఇప్పుడు చేస్తోన్న సినిమా కంగువా.. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్. అతని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న చిత్రం ఇది. రీసెంట్ గా వచ్చిన టీజర్ చూస్తే సూర్య నుంచి ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ రాబోతోందని ఫిక్స్ అయ్యారు. తెలుగులో శౌర్యం, శంఖం వంటి చిత్రాలు చేసిన శివ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీ తర్వాత మోస్ట్ అక్లెయిమ్డ్ డైరెక్టర్ వెట్రిమారన్ తో సినిమా ఉంది. ‘వడివాసలై’ అనే టైటిల్ తో రాబోతోన్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తయి ఉంది. అదీ మేటర్.

Related Posts