రీ షూట్ లో సలార్.. ఈ యేడాది కష్టమే

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినప్పుడే అంచనాలు ఆకాశాన్నంటాయి. వాటిని అందుకునేందుకు టీమ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది. ఒక్క పోస్టర్ తప్ప మధ్యలో ఏ అప్డేట్ లేకుండా జాగ్రత్త పడ్డారు. అయినా ఎక్స్ పెక్టేషన్స్ తగ్గలేదు. టీజర్ లో ప్రభాస్ ఫేస్ కనిపించకపోయినా ఫీల్ అవలేదు ఫ్యాన్స్. ఇంతా చేసి ఈ నెల 28న విడుదల కావాల్సిన సినిమాను సడెన్ గా వాయిదా వేశారు. ఇందుకు కారణాలుగా వాళ్లు చెప్పింది.. అందరికీ తెలుసు. కొన్ని సీన్స్ లో సిజి వర్క్ సరిగా రాలేదు అని ఆపారట. ప్రశాంత్ నీల్ అవుట్ పుట్ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటాడు అంటుంటారు. అందుకే ఆపాడు అనుకున్నారు. బట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను అలా సడెన్ గా వాయిదా వేస్తే అప్పటికే అంచనాలు పెట్టుకున్నవాళ్లతో పాటు కొన్నవాళ్లు కూడా అప్సెట్ అవుతారు కదా. అందుకే వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని ఈ యేడాదే విడుదల చేస్తాం అని హామీ ఇచ్చారు. దీంతో నవంబర్, డిసెంబర్ లలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నవారికి లేటెస్ట్ గా మరో షాక్ ఇచ్చింది మూవీ టీమ్.


సలార్ కు సంబంధించి పెండింగ్ లో ఉంది సిజి వర్క్ కాదు. కొన్ని సీన్స్ నే మళ్లీ చిత్రీకరిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఆల్రెడీ చిత్రీకరణ మొదలుపెట్టారు. ఇలాంటి పెద్ద సినిమాలకు చిన్న చిన్న విషయాలకు రీ షూట్ కు వెళ్లరు. అంటే ఇది పెద్ద వ్యవహారమే అనుకోవాలి. ఈ రీ షూట్స్ అనేది ఎన్ని సీన్స్ లో ఉంటుందనేది చెప్పడం లేదు. ప్రభాస్ ఎలాగూ అబ్రాడ్ లో ఉన్నాడు కాబట్టి ఈ సీన్స్ ప్రభాస్ కు సంబంధించినవి కాదు. సో.. రీ షూట్ చేసి మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కూడా చేయాల్సి ఉంటుంది. సో.. సలార్ ఎట్టి పరిస్థితుల్లోనూ మేకర్స్ హామీ ఇచ్చినట్టుగా ఈ యేడాది విడుదల కాదు అనే అంటున్నారు.


ఇక కొత్త డేట్ గా 2024 సంక్రాంతి లేదా రిపబ్లిక్ డే అంటున్నారు. సలార్ లాంటి సినిమాకు సీజన్ అవసరం లేదు. ఎప్పుడు వస్తే అప్పుడే సీజన్ అవుతుంది. కాకపోతే కంటెంట్ లో దమ్ముండాలి. మొత్తంగా ప్రభాస్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర చేస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్, మీనాక్షి చౌదరి, ఈశ్వరిరావు, తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.

Related Posts