‘వార్ 2‘ అప్డేట్.. ముంబై బయలుదేరిన ఎన్టీఆర్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీస్ లిస్టులో ‘వార్ 2‘ ఒకటి. కనీవినీ ఎరుగని రీతిలో ఓ బాలీవుడ్ సూపర్ స్టార్.. ఓ సౌత్ సూపర్ స్టార్ కలయికలో రూపొందుతోన్న క్రేజీ మల్టీస్టారర్ ఇది. బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్, సౌత్ నుంచి ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్ 2‘కి అయన్ ముఖర్జీ దర్శకుడు. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ‘వార్ 2‘ సెట్స్ లోకి ఇప్పుడు ఎన్టీఆర్ ఎంటరవుతున్నాడు.

శుక్రవారం (ఏప్రిల్ 12) నుంచి ‘వార్ 2‘ షూట్ లో జాయిన్ కాబోతున్నాడు తారక్. అందుకోసమే.. హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరాడు. ఒక వారం పాటు కంటిన్యూస్ గా ‘వార్ 2‘ షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తాడట ఎన్టీఆర్. ఆ తర్వాత మూడు రోజుల పాటు ‘దేవర‘ ప్యాచ్ వర్క్ లో పాల్గొననున్న తారక్.. మళ్లీ వెంటనే ‘వార్ 2‘ కోసం ముంబై వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మొత్తంమీద.. ఇండియాస్ మోస్ట్ క్రేజీ మల్టీస్టారర్ ‘వార్ 2‘ సెట్స్ లోకి ఎట్టకేలకు ఎన్టీఆర్ ఎంటరవుతున్నాడన్నమాట.

Related Posts