కమల్, రజనీకాంత్ తర్వాత విజయ్ వంతొచ్చింది!

కోలీవుడ్ స్టార్స్ ఒక్కొక్కరుగా తమ రాబోయే సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఈ లిస్టులో విశ్వనటుడు కమల్ హాసన్ ముందుగా ‘ఇండియన్ 2‘ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశాడు. కమల్, శంకర్ కలయికలో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ ‘ఇండియన్‘కి సీక్వెల్ గా ‘ఇండియన్ 2‘ రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్, ఉదయనిధి స్టాలిన్ రెడ్ జయంట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఇండియన్ 2‘ని జూన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు.

కమల్ తర్వాత రజనీకాంత్ కూడా తన ‘వేట్టయాన్‘ మూవీకి రిలీజ్ మంత్ ని అనౌన్స్ చేశాడు. కమల్ ‘ఇండియన్ 2‘ జూన్ లో వస్తుంటే.. రజనీకాంత్ ‘వేట్టయాన్‘ అక్టోబర్ లో విడుదలవుతోంది. అయితే.. ‘ఇండియన్ 2‘కి పక్కా విడుదల తేదీని ప్రకటించలేదు. అలాగే.. రజనీకాంత్ ‘వేట్టాయాన్‘కి కూడా సరైన విడుదల తేదీని ప్రకటించకుండా అక్టోబర్ లో వస్తుందని మాత్రం చెప్పారు. ‘జై భీమ్‘ ఫేమ్ TJ జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న ‘వేట్టయాన్‘లో అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాసిల్ వంటి భారీ తారాగణం ఉంది.

కమల్, రజనీకాంత్ తర్వాత కోలీవుడ్ నుంచి మరో స్టార్ హీరో విజయ్ కూడా తన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‘ మూవీకి రిలీజ్ డేట్ లాక్ చేశాడు. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి వెళ్లే ముందు చివరి చిత్రంగా ‘ది గోట్‘ ప్రచారంలో ఉంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నారు.

Related Posts