‘మంజుమల్ బాయ్స్‘ ప్రదర్శనలను నిలిపివేసిన పీవీఆర్

మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డులు లిఖించింది ‘మంజుమ్మల్ బాయ్స్‘ చిత్రం. ఈ సినిమాని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అందించింది. విడుదలైన తొలి రోజు నుంచే ‘మంజుమ్మల్ బాయ్స్‘కి తెలుగులో మంచి ఆదరణ లభిస్తూ వస్తోంది. రోజురోజుకూ థియేటర్లు పెరుగుతున్న ఈ నేపథ్యంలో.. ఈ సినిమా ప్రదర్శనను అర్థాంతరంగా నిలిపివేసింది పీవీఆర్ మల్టిఫ్లెక్స్.

‘మంజుమ్మల్ బాయ్స్‘ మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రదర్శనను ఆపేసినట్లు పీవీఆర్ వెల్లడించింది. పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నిర్మాతతో వివాదం ఉంటే తెలుగు వర్షన్ ను ఎలా ఆపేస్తారని ప్రశ్నించారు. మంచి వసూళ్లు సాధిస్తున్న క్రమంలో అర్థాంతరంగా ఆపేయడం అన్యాయమన్న శశిధర్ రెడ్డి… ప్రదర్శనలు ఆపడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నట్లు తెలిపారు. పీవీఆర్ మల్టిప్లెక్స్ వ్యవహారశైలిని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై ఈ రోజు సాయంత్రం అత్యవసర సమావేశం కానుంది.

Related Posts