‘కల్కి‘ నుంచి క్రేజీ టీజర్ వచ్చేస్తుంది?

రెబెల్ స్టార్ మోస్ట్ అవైటింగ్ ‘కల్కి 2898 ఎ.డి.‘ రిలీజ్ కు కేవలం రెండు నెలలు సమయం మాత్రమే ఉంది. జూన్ 27న వరల్డ్ వైడ్ గా ‘కల్కి‘ రిలీజ్ కు రెడీ అవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్స్ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ మొదలుకొని.. విశ్వనటుడు కమల్ హాసన్, దీపిక పదుకొనె, దిశా పటాని వంటి ఎంతోమంది నటీనటులు ఉన్నారు.

ఇప్పటికే ‘కల్కి‘ నుంచి టీజర్.. అమితాబ్ పోషిస్తున్న అశ్వథ్థామ పాత్రకు సంబంధించిన ఇంట్రో టీజర్స్ ను రిలీజ్ చేసింది టీమ్. ఈరోజు (ఏప్రిల్ 30) ‘కల్కి‘ నుంచి మరో క్రేజీ అప్డేట్ రాబోతుందట. ఈ సినిమాలో ప్రభాస్ పోషిస్తున్న భైరవ పాత్రకు ఇంట్రో గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతుందట టీమ్. స్టార్ స్పోర్ట్స్ వేదికగా ఈరోజు రాత్రి 8 గంటల 20 నిమిషాలకు ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారట.

Related Posts