విశ్వక్ సేన్ టైటిల్ అదేనా..

టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ దూకుడు మీదున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. నటనతో పాటు స్క్రిప్ట్, దర్శకత్వం కూడా చేస్తుంటాడు.ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సితార బ్యానర్ నిర్మిస్తోన్న సినిమా ఇది. కృష్ణ చైతన్య లిరిసిస్ట్ నుంచి దర్శకుడుగా మారాడు. గతంలో నారా రోహిత్ తో రౌడీఫెలో అనే సినిమాతో ఆకట్టుకున్నాడు కూడా.

నితిన్ తో చేసిన ఛల్ మోహన రంగా పోవడంతో తర్వాత దర్శకుడుగా అవకాశాలు తగ్గాయి.ఈ కథను కూడా అతను నితిన్ తోనే చేయాలనుకున్నాడు.కానీ చాలా కాలం వెయిట్ చేయించిన నితిన్ ఫైనల్ గా నో చెప్పాడు. దాన్నే కాస్త మార్పులు చేసి విశ్వక్ సేన్ ను ఒప్పించాడు. సితార బ్యానర్ సినిమా కాబట్టి స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ సూచనలు, సలహాలు కూడా ఉన్నాయి. ఇక యువన్ శంకర్ రాజా సంగీతం చేస్తున్న ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తోది.


కొన్నాళ్ల క్రితం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఇది కూడా పీరియాడిక్ మూవీలా కనిపించింది. అది నిజమే అంటున్నారు లేటెస్ట్ గా. ఇక ఈ సోమవారం ఈ మూవీ టైటిల్ రివీల్ చేయబోతున్నారు. వాళ్లు అఫీషియల్ గా చెప్పడానికి ముందే ఆ టైటిల్ ఏంటో లీక్ అయిపోయింది. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”టైటిల్ ఇదే అంటున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ అనే టైటిల్ తో వచ్చిన రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ తర్వాత కూడా గ్యాంగ్స్ ఆఫ్ అంటూ మరికొన్ని చిత్రాలు వేర్వేరు భాషల్లో వచ్చాయి. తెలుగులో ఇదే ఫస్ట్ టైమ్. టైటిల్ అయితే ఆకట్టుకునేలా ఉంది.క్యాచీగానూ ఉంది. మరి నిజంగా టైటిల్ ఇదే ఫిక్స్ అయిందా లేక ఇంకేదైనా అనేది మరికొన్ని గంటల్లో తెలుస్తుంది. అయితే ఈ చిత్రం గోదావరి జిల్లాల్లో 1980ల కాలంలో సాగే కథ అంటున్నారు.

Related Posts