ముగిసిన ఓటింగ్.. కౌంటింగ్ షురూ..

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు కోలాహలంగా జరిగాయి. ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా సార్వత్రిక ఎన్నికలను తలపించిన ఎన్నికల్లో దిల్ రాజు, సి కళ్యాణ్ ప్యానెల్స్ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. ఛాంబర్ ప్రెసిడెంట్ ఎవరు అనేది మరో రెండు గంటల్లో తెలిసిపోతుంది. ఉదయం టెక్నికల్ సమస్య రావడంతో ఓటింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యంగా మొదలైంది. ముందే షెడ్యూల్ చేసినట్టుగా నాలుగు గంటలకు ఓటింగ్ ను నిలిపివేశారు. అప్పటి నుంచి కౌంటింగ్ మొదలైంది. అయితే ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల సరళి ఎలా ఉందనేది చూద్దాం.. మొత్తం మూడు సెక్టార్స్ లో ఎన్నికలు జరిగాయి.

  1. ప్రొడ్యూసర్స్ సెక్టర్ లో 1567 ఓట్లు ఉండగా సాయంత్రానికి పోల్ అయిన ఓట్లు 891
  2. స్టూడియో సెక్టార్ లో 98 ఓట్లు ఉండగా సాయంత్రానికి పోల్ అయినవి 68 ఓట్లు
  3. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో 597 ఓట్లు ఉన్నాయి. వీటిలో 380 ఓట్లు పోల్ అయ్యాయి.
    ఓవరాల్ గా చూస్తే మొత్తం ఓట్లు 2,262 ఓట్లు ఉండగా పోల్ అయినవి 1339 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నమాట.

ఇక దిల్ రాజు, సి కళ్యాణ్‌ ప్యానల్స్ పోటీ పడి మరీ ఎన్నికల కేంద్రంలో తమ కార్యకర్తలను నియమించుకున్నారు. ఓటింగ్ కు వస్తోన్న ప్రతి గెస్ట్ ను ఆహ్వానిస్తూ తమ సింబల్స్ ను చూపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఓ రకమైన సందడి వాతావారణంలో జరిగిన ఎన్నికల హడావిడీ సాయంత్రానికి ముగిసిపోనుంది.

Related Posts