హుకుం జారీ చేసిన రజినీకాంత్

“ఏయ్.. ఇక్కడ నేనే కింగ్.. నేను పెట్టినవే రూల్స్.ఆ రూల్స్ ను నేను అప్పుడప్పుడూ ఇష్టానికి మారుస్తుంటాను. అది విన గప్ చుప్ గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చిపనులు చేయాలని చూశావో.. నిన్ను ఖండఖండాలుగా నరికి విసిరిపారేస్తాను..హుకుం.. టైగర్ గా కా హుకుమ్..” ఇది సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీ నుంచి వచ్చిన సాంగ్ లోని డైలాగ్స్.

ఇది చూస్తే చాలు కదా జైలర్ సినిమాలో ఆయన పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతోందో. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. రజినీకాంత్ సరసన తమన్నా కథానాయికగా నటించింది. ఆగస్ట్ 11న విడుదల కాబోతోన్న ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్, సునిల్, రమ్యకృష్ణ, వినాయకన్ వంటి భారీ తారాగణం ఉంది.


రీసెంట్ గా వచ్చి నువ్వు కావాలయ్యా పాటకు తెలుగు వెర్షన్ అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఈ హుకుమ్ మాత్ర అదిరిపోయిందనే చెప్పాలి. భాస్కరభట్ల రాశాడు. దిన్ కర్ పాడాడు. సంగీతం అనిరుధ్ అందించాడు. “ఉరుముకి మెరుపుకి పుట్టాడురా.. పిడుగును పిడికిట పట్టాడురా.. అడుగడుగున గుడి కట్టాలిరా.. మనిషిని మనిషిగ చూస్తాడురా.. మనసుకు మనసు ఇస్తాడురా.. గడబిడ జరిగితే లేస్తాడురా.. ఒరిగిన మెడలకు ఉరి తాడురా” అంటూ సాగే సాహిత్యం ఆకట్టుకుంటోంది. మామూలుగా భాస్కరభట్ల ఇలాంటి పాటల్లో కాస్త వీక్ అనిపించుకున్నాడు. బట్ ఈ సారి అదరగొట్టాడు అనే చెప్పాలి. తమిళ్ సాంగ్ కు ఏ మాత్రం తగ్గని రేంజ్ లో తెలుగు పదాలతో ఆకట్టుకున్నాడు.


ఈ పాటలోని వీడియోలో రజినీకాంత్ స్వాగ్ చూస్తే మరోసారి ఆయన తనదైన శైలిలో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నాడా అనిపిస్తోంది.

Related Posts