‘జటాయు’గా విజయ్ దేవరకొండ

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో ఒక్కసారిగా ఫేమ్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో యూత్ లో, గీత గోవిందంతో ఫ్యామిలీస్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత అతనికి సక్సెస్ లు ఆగాయి. వరుసగా సినిమాలన్నీ పోతున్నాయి. భారీ అంచనాలతో ప్యాన్ ఇండియన్ సినిమాగా వచ్చిన లైగర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

విశేషం ఏంటంటే.. ఇన్ని ఫ్లాపులున్నా.. విజయ్ దేవరకొండ క్రేజ్ తగ్గలేదు. రేంజ్ మారలేదు. అందుకే రాబోయే సినిమాలన్నీ భారీగానే కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 1న సమంతో కలిసి నటించిన ఖుషీ విడుదల కాబోతోంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. పాటల్లో చూస్తేనే సమంత, విజయ్ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరినట్టు కనిపిస్తోంది.

ప్రస్తుతం మరో రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ సినిమాతో పాటు దిల్ రాజు బ్యానర్ లో పరశురామ్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు. గౌతమ్ సినిమాలో సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నాడు విజయ్. ఈ తరహా పాత్ర అతనికి ఇదే మొదటిసారి. ఇక పరశురామ్ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందట.

ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఇవి కాక లేటెస్ట్ గా మరో ప్యాన్ ఇండియన్ రేంజ్ కంటెంట్ కు ఓకే చెప్పాడు. విశేషం ఏంటంటే ఈ చిత్రానికి ‘జటాయు’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసేది ఎవరో తెలుసా.. ఇంద్రగంటి మోహనకృష్ణ. ఇతను ఇప్పటి వరకూ మీడియం, లో బడ్జెట్ సినిమాలు మాత్రమే చేశాడు. కానీ బ్రిలియంట్ డైరెక్టర్ అనే పేరు మాత్రం ఉంది. చివరగా నాని, సుధీర్ బాబుతో చేసిన వి డిజాస్టర్ అయినా.. దిల్ రాజు అతన్ని నమ్మాడు. అందుకే ఇంత పెద్ద ప్రాజెక్ట్ తో వస్తున్నాడు.

ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కు భారీగా ఉంటాయట. ఇక జటాయు అంటే తెలుసు కదా..? రామాయణంలోని అరణ్యకాండలో రావణుడు సీతను ఎత్తుకుపోతున్నప్పుడు ఆమెను కాపాడేందుకు ప్రాణాలు అడ్డుపెట్టి మరీ పోరాటం చేస్తాడు జటాయువు అనే పక్షి. ఈ పోరాటంలో అతను మరణిస్తాడు. ఆ త్యాగానికి చలించిన శ్రీ రాముడు స్వయంగా తనే దహన సంస్కారాలు చేస్తాడు.

అలాంటి పాత్రే విజయ్ దేవరకొండ చేస్తున్నాడా అనేది తెలియదు కానీ.. జటాయు అనే టైటిల్ మాత్రం ఖరారు చేసుకున్నాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. మరి ఇది పౌరాణికమేనా లేక ఆ కథనాన్ని సాంఘికంగా మలిచారా అనే అంశాలతో పాటు సినిమాను కూడా అఫీషియల్ గా త్వరలోనే ప్రకటించబోతున్నారు. మరి ఇలాంటి పాత్రలో విజయ్ దేవరకొండ ఎలా సూట్ అవుతాడో కానీ.. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు.

Related Posts