ప్రభాస్ ఫ్యాన్స్ అతన్ని వదిలేలా లేరు

సినిమాలు మనోల్లసాన్ని కలిగించడమే కాదు.. మనో భావాలను దెబ్బతీస్తాయి కూడా. ముఖ్యంగా ఇవి ఈ మధ్య మతో భావాలుగా కూడా మారాయి కాబట్టి.. ఆ బ్యాక్ డ్రాప్ లో చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఇప్పుడసలే సోషల్ మీడియా ఉంది. ఎవడు పడితే వాడు ఏదైనా మాట్లాడేయొచ్చు. మాటల్లో ఫిల్టర్ ఉండదు. భాషలో సంస్కారం ఉండదు. అయితే ఈ విషయంలో హీరోల అభిమానులు కూడా తక్కువేం కాదు.

అందుకే ఆ మధ్య ఆదిపురుష్ అనే కళాఖండాన్ని ప్రభాస్ తో చేయించిన ఆ చిత్ర దర్శకుడు ఓమ్ రౌత్ ను సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ప్రభాస్ కెరీర్ కు పాడు చేసేందుకే ఈ సినిమా చేశాడు అంటూ అదే పనిగా వల్గర్ లాంగ్వేజ్ లో ఓమ్ రౌత్ ను ఓ ఆట ఆడుకున్నారు. అటు హిందువులు కూడా రామాయణాన్ని ఇష్టం వచ్చినట్టు తీశాడని ఓమ్ తో పాటు నిర్మాతలపైనా కేస్ లు వేశారు.

ఇప్పటికీ ఆ కేస్ లు ఎక్కడో చోట నమోదవుతూనే ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడికి భయపడ్డ ఓమ్ రౌత్ వాడటమే మానేశాడు. ఇక ఈ గొడవ తగ్గింది అనుకున్నాడేమో లేటెస్ట్ గా ఓ పోస్ట్ పెట్టాడు.


ఓమ్ రౌత్ ఈ మధ్య గోవా వెళ్లాడట. అక్కడ ఉన్న రెండు హిందూ దేవాలయాలను దర్శించుకుని దేవుడి ఆశిస్సులు తీసుకున్నా అంటూ పోస్ట్ చేశాడు. అంతే.. దొరికాడు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ మాటల దాడి మొదలుపెట్టారు. ఆదిపురుష్ లాంటి సినిమా తీసిన నీ లాంటి వాడిని ఏ దేవుడూ ఆశీర్వదించడు అని కొందరు, ప్రభాస్ తో తీయాల్సిన సినిమానా అది అంటూ మరికొందరు..ఇంకొందరైతే వీడు ఇంకా బతికే ఉన్నాడా అంటూ తీవ్ర వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నారు.

దీంతో మళ్లీ సైలెంట్ అయిపోయాడు ఓమ్ రౌత్. ఏదేమైనా కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతుంటాయి. కానీ మతాలతో పెట్టుకుంటే మాత్రం మాటల మంటలే కాదు.. మనుషుల్నే మంటల్లో కలుపుతున్న కాలం కదా.. అందుకే హిందువే అయిన ఓమ్ రౌత్ కూడా దీనికి మినహాయింపు కాలేకపోయాడు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా ఎన్నాళ్లు అతని ఆడుకుంటారో చూడాలి.

Related Posts