నితిన్ ని కొత్తగా చూపించబోతున్న వెంకీ కుడుముల

నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వచ్చిన ‘భీష్మ’ మంచి విజయాన్ని సాధించింది. ఒక విధంగా ఈ సినిమా తర్వాత మళ్లీ నితిన్ కి ఆ రేంజ్ హిట్ దక్కలేదు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ రెండోసారి కలిసి పనిచేస్తున్నారు. ‘వి.ఎన్.2’ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఓ పోస్టర్ రిలీజయ్యింది. ఓ ఎత్తైన బిల్డింగ్ పై డిఫరెంట్ గెటప్ తో వెనుక నుంచి నితిన్ నిలబడటం ఈ పోస్టర్లో చూడొచ్చు. ‘అడ్వెంచరస్ ఎంటర్టైనర్ కమింగ్ యువర్ వే’ అంటూ ఈ పోస్టర్ కి క్యాప్షన్ ఇచ్చారు. దీన్ని బట్టే ఈ మూవీ ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు.

ఈ మూవీలో నితిన్ దొంగగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ‘గిఫ్ట్స్ ఇచ్చే సీజన్ ముగిసింది. త్వరలో దోచుకునే సీజన్ మొదలు అవుతుంది.’ అంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పోస్టర్ ను ట్వీట్ చేసింది. జనవరి 26న ఈ సినిమాలో నితిన్ ఫేస్ రివీల్ కానుంది. ఈ చిత్రంలో తొలుత రష్మిక ను నాయికగా తీసుకున్నారు. అయితే.. ఆమెకు వేరే సినిమాలతో డేట్స్ క్లాష్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె ప్లేసులో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts