ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ‘SSMB 29’

ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘SSMB 29’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో దూసుకెళ్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ చిత్రంగా తెరకెక్కే ఈ సినిమాని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి కొన్ని విశేషాలు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్నాయి. వాటి ప్రకారం.. ‘SSMB 29’ ఇండియాలోనే కాస్ట్లీయెస్ట్ మూవీగా రూపొందనుందట. ఇండియన్ ఇండియానా జోన్స్ గా రూపొందే ఈ చిత్రం పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో ఉండదట.. ప్రెజెంట్ స్టోరీగానే తీర్చిదిద్దనున్నాడట జక్కన్న.

తన సినిమా కథ గురించి ముందుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతుంటాడు రాజమౌళి. ఈ సినిమా విషయంలోనే అదే చేయనున్నాడట. మరోవైపు రాజమౌళి ఆస్థాన మ్యూజిక్ కంపోజర్ కీరవాణి ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టాడట. ఆద్యంతం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా ముహూర్తాన్ని త్వరలోనే జరపనున్నట్టు తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ ఈ సినిమాని నిర్మించనున్నారు.

Related Posts